Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The real reason for Kotayya's death is Anandayya's friend's explanation.

 కోటయ్య మరణానికి అసలు కారణం ఏంటంటే ఆనందయ్య మిత్రుడు వివరణ.

The real reason for Kotayya's death is Anandayya's friend's explanation.

నెల్లూరు: (ఆంధ్రజ్యోతి) జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి చెందారు. ఆయన మృతిపై స్పందించిన ఆనందయ్య మిత్రుడు ఓ వీడియో పోస్టు చేశారు. ఆనందయ్య మందువల్ల బాగుందని చెప్పిన కోటయ్య వీడియో వైరల్ అయిందన్నారు. ఈ నెల 20వ తేదీన కంటి చుక్కల మందుకు మాత్రమే ఆయన కృష్ణపట్నం వచ్చారని, అప్పటికే ఆయనకు కోవిడ్ వచ్చి తగ్గిపోయిందన్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయని చెప్పడంతో చుక్కల మందు వేయడంతో ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయన్నారు. ఆ తర్వాత ఆయన ఆస్పత్రిలో ఉంటే తాము వెళ్లి మాట్లాడామని, ఆయనకు 80 శాతం ఊపిరితిత్తులు పాడయ్యాయన్నారు. అలాగే వేరే ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ చనిపోయారన్నారు.

అయితే ఆనందయ్య మందుతో చనిపోయాడని చెప్పడం చాలా బాధాకరమని అన్నారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి చెందారు. గతంలో ఆనందయ్య మందుతో కోలుకున్నానని కోటయ్య చెప్పిన విషయం తెలిసిందే. అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో కోటయ్య వీడియోలు హల్‌చల్ చేశాయి. అయితే ఆనందయ్య వైద్యాన్ని తప్పుగా నిరూపించడం కోసం కూడా ప్రయత్నాలు జరిగాయి. తాజాగా ఆయన జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఆనందయ్య మందు తీసుకున్న అనంతరం ఆక్సిజన్ లెవల్స్ పెరగడంతో కుదుటపడ్డారు. అనంతరం ఆయన ఆరోగ్యం తిరిగి విషమించడంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోటయ్య సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

అప్పట్లో దాదాపు మరణం అంచులకు వెళ్లి ఆనందయ్య మందుతో తిరిగి వచ్చానని కోటయ్య చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ''ఊపిరి అందడంలేదు. కొన ఊపిరితో ఉన్న.. ఇంకా రెండు నిముషాలు ఆగితే, ఆక్సిజన్ లేకపోతే చనిపోతా.. దీంతో వెంటనే మావాళ్లు వచ్చి వెంటనే కంటిలో మందు వేశారు. 10, 15 నిముషాల్లో కోలుకున్నానని, ఈ మందు చాలా అద్భుతం'' అని గతంలో కోటయ్య తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The real reason for Kotayya's death is Anandayya's friend's explanation."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0