Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

YSR Uchitha Pantala Bheema Scheme Beneficiary List 2021 AP Crop Insurance Farmers List.

 ఏపీలో రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్‌ పంటల బీమా 2021

YSR Uchitha Pantala Bheema Scheme Beneficiary List 2021 AP Crop Insurance Farmers List.

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్‌-2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,820.23 కోట్ల పరిహారం విడుదల చేసింది. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రైతుల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టామని, వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పరిహారం విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈనెలలోనే రైతు భరోసా కింద సుమారు 3,900 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 60 శాతానికిపైగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా 25-05-2021 రోజు ఉచిత పంటల భీమా కార్యక్రమం ప్రారంభం అయింది.

రైతులు, రైతు కూలీలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్నారు. గతేడాది ఖరీఫ్‌లో 15.15 లక్షల మంది రైతులకు పంట నష్టం జరిగిందని, పంట నష్టపోయిన రైతులందరికీ రూ.1,820.23 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. 2018-19 ఇన్సూరెన్స్‌ బకాయిలను కూడా 715 కోట్లు విడుదల చేశామని, 2019-20 ఉచిత పంటల బీమా పరిహారంగా మరో రూ.1253 కోట్లు ఇచ్చామని సీఎం జగన్‌ తెలిపారు. గత ప్రభుత్వాలు ఇన్సూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీలను నిర్లక్ష్యం చేశాయన్నారు.

పంట నష్టపోయిన రైతులకు పరిహారం రైతులకు అదే సీజన్‌లో పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు.

రైతులపై భారం పడకుండా పంటల బీమాని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.

23 నెలల కాలంలో రైతుల కోసం రూ.83వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని చెప్పారు.

రాష్ట్రంలో ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేశామని, గ్రామ సచివాలయాలతోపాటు 10,778 ఆర్‌బీకేలు ఏర్పాటు చేశామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ రైతుల పక్షపాతి అని, 2020 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందజేశారని తెలిపారు. నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేశారని పేర్కొన్నారు. 15.15 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 30 రకాల పంటలకు ఇన్సూరెన్స్ వస్తుందని వివరించారు.

పంటల బీమా స్టేటస్ కోసం క్రింద చూడగలరు

YSR Uchitha Pantala Bheema Scheme Beneficiary List 2021

క్రాఫ్ట్ వెబ్ సైట్ లో మీ పేరు నమోదు అయిందో లేదో ఇక్కడ చెక్ చేసుకోగలరు.

Check here Benefitary Name

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "YSR Uchitha Pantala Bheema Scheme Beneficiary List 2021 AP Crop Insurance Farmers List."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0