Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

From today schools are for teachers only

నేటి నుంచి స్కూళ్లు టీచర్స్ కి మాత్రమే

From today schools are for teachers only

  • కోవిడ్‌ పరిస్థితులు సద్దుమణిగాకే పాఠశాలలకు విద్యార్థులు
  • రోజువిడిచిరోజు వంతున రోజూ సగం మంది టీచర్లు మాత్రమే హాజరు
  • విద్యార్థులకు డిజిటల్‌ పరికరాల అందుబాటును అనుసరించి ఆన్‌లైన్‌ బోధన
  • జూలై 15 నుంచి తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు వర్క్‌షీట్లు

రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలలు నేటినుంచి తెరుచుకోనున్నాయి. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రొటోకాల్‌ పాటిస్తూ పాఠశాలలకు టీచర్లు మాత్రమే హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్‌ పరిస్థితులు సద్దుమణిగాక మాత్రమే విద్యార్థులను స్కూళ్లకు అనుమతిస్తారు. టీచర్లు రోజువిడిచిరోజు (ఒకరోజు కొందరు, మరోరోజు కొందరు) వచ్చేలా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎవరు ఎప్పుడు పాఠశాలకు హాజరుకావాలన్న ప్రణాళికను ప్రధానోపాధ్యాయులు రూపొందించి అమలు చేస్తారు. 2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి బోధనాభ్యసన సన్నద్ధతకు వీలుగా ఏర్పాట్లు చేపట్టనున్నారు. ముందుగా టీచర్లను సన్నద్ధం చేస్తూ అదే సమయంలో కోవిడ్‌ కారణంగా ఇళ్లవద్దనే ఉంటున్న పిల్లలకు చదువులకోసం తగిన సహాయ సహకారాలు అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

నేడు మాత్రం టీచర్లంతా హాజరుకావాలి

నేడు (గురువారం) ఒక్కరోజు అన్ని పాఠశాలల టీచర్లంతా స్కూళ్లకు హాజరుకావాలి. మరుసటి రోజు నుంచి రోజూ సగం మంది వంతున రావాలి. హైస్కూళ్లలో రోజూ తప్పనిసరిగా సగం మంది టీచర్లు ఉండేలా ప్రధానోపాధ్యాయుడు చూసుకోవాలి. విద్యార్థులకు డిజిటల్‌ పరికరాల అందుబాటు, వారితో అభ్యసన ప్రక్రియ సాగించే విధానాలపై ఎక్కడికక్కడ ప్రణాళికలు రూపొందించుకోవాలి. తమ తరగతి పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటే వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటుచేయించి వాటిద్వారా బోధనాభ్యసన ప్రక్రియలు సాగించాలి. జూలై 2 నుంచి 15వ తేదీ వరకు పునశ్చరణ చేయించాలి. జూలై 15 నుంచి ఎస్సీఈఆర్టీ పిల్లలకు వర్క్‌షీట్లు పంపిణీ చేస్తుంది. తల్లిదండ్రులు మాత్రమే పాఠశాలలకు వెళ్లి వర్క్‌షీట్లు తీసుకోవాలి. రేడియో, దూరదర్శన్‌ ద్వారా విద్యాబోధనకు షెడ్యూల్‌ను ఎస్సీఈఆర్టీ విడుదల చేయనుంది. జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, మనబడి నాడు–నేడు వంటి కార్యక్రమాలు సమర్థంగా జరిగేలా టీచర్లు చూడాలి. జగనన్న విద్యాకానుక కిట్‌లను విద్యార్థులు స్కూళ్లకు వచ్చేనాటికి పంపిణీకి వీలుగా సిద్ధం చేసుకోవాలి.

ఉపాధ్యాయులకు మనవి.

లేని పోని ప్రశ్నలు వద్దు 

స్కూల్స్  Timings & Bio metric గురించి ఏమి చెప్ప లేదు.

అందులకు అధికారులను స్కూల్స్ నందు ఎప్పటి వరకు ఉండాలని గానీ, బయో మెట్రిక్ వేయాలా అని లేని పోని ప్రశ్నలు దయచేసి చేయద్దు.

 విధంగా చేస్తే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండాలని బయోమెట్రిక్ వేయాలని ఉత్తర్వులు ఇస్తారు.

ఉన్న సౌలభ్యాన్ని అధికారులతో(MEO/HM) సఖ్యతతో వారి అనుమతితో, వారికి ఇబ్బంది కలగకుండా ఒక రకంగా సింగిల్ Session గా ఉపయోగించు కునే అవకాశం ఉంది..

కొన్నిటికి రూల్స్ ఉండవు. 

లౌక్యం, రిక్విసిషన్ తో మంచిగా పోదాము.

కరోనా విపత్తు నుండి, ఎంతో భయాందోళన ల తర్వాత కొద్ది పాటి ధైర్యం తో తిరిగి పాఠశాల లు వస్తున్న సమయంలో ఎవ్వరినీ ఎవరు ఇబ్బంది పెట్టకుండా సజావుగా సాగడానికి అందరూ సహకరించు కోవాలి..

లేని పోని ప్రశ్నలు వద్దు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "From today schools are for teachers only"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0