Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

3211 Village, Ward Volunteer Jobs in AP .. District wise details of vacancies

 APలో 3211 గ్రామ, వార్డు వాలంటీర్‌ జాబ్స్‌.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలివే

3211 Village, Ward Volunteer Jobs in AP .. District wise details of vacancies

gswsvolunteer.apcfss.in: ఈ నోటిఫికేషన్‌ ద్వారా 3211 వాలంటీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. పదోతరగతి/ ఇంటర్‌ ఉత్తీర్ణులైన స్థానికులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రధానాంశాలు:

ఏపీలో వాలంటీర్‌ జాబ్స్‌

వివిధ జిల్లాల్లో 3211 జాబ్స్‌ భర్తీ

అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు

గ్రామ వార్డు వాలంటీర్‌ జాబ్స్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన పంచాయతీ రాజ్‌ అండ్‌ గ్రామీణాభివ`ద్ధి శాఖ వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 3211 గ్రామ, వార్డు వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 3211 వాలంటీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. పదోతరగతి/ ఇంటర్‌ ఉత్తీర్ణులైన స్థానికులు దరఖాస్తు చేసుకోవచ్చు.

జిల్లా సెలెక్షన్‌ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు జిల్లాల వారీగా వేరు వేరు చివరి తేదీలున్నాయి. పూర్తి వివరాలకు https://gswsvolunteer.apcfss.in/ లేదా https://apgv.apcfss.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

నోటిఫికేషన్‌ వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయగలరు.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు

శ్రీకాకుళం- 576

తూర్పు గోదావరి- 367

పశ్చిమ గోదావరి - 432

కర్నూలు- 58

అనంతపురం- 1480

విజయనగరం- 298

ముఖ్య సమాచారం

అర్హత: పదో తరగతి/ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. స్థానికంగా నివాసం ఉండాలి. అలాగే ప్రభుత్వ పథకాలమీద పూర్తి అవగాహన అవసరం. ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై పరిజ్ఞానం ఉండాలి. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ అవసరం. తెలుగు రాయడం, చదవడం తెలిసుండాలి.

వయసు: అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ: ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహనకు 25 మార్కులు; ప్రభుత్వ సంక్షేమ విభాగాలు, సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవానికి 25 మార్కులు; నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు 25 మార్కులు; సాఫ్ట్‌ స్కిల్స్‌కు 25 మార్కులు కేటాయించారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: జిల్లాల వారీగా చివరి తేదీలు వేరువేరుగా ఉన్నాయి. నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు చూడొచ్చు.

వెబ్‌సైట్‌:https://gswsvolunteer.apcfss.in/ లేదా https://apgv.apcfss.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "3211 Village, Ward Volunteer Jobs in AP .. District wise details of vacancies"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0