AP Govt Jobs: Good news for the unemployed in AP .. Notification issued to replace those jobs .. Details
AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే
రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(APVVP) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ భర్తీ చేసింది. రెగ్యులర్ ప్రతిపదికన ఈ ఉద్యోగాలకు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. మొత్తం 453 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
1. గైనకాలజీ విభాగంలో 269 ఖాళీలు ఉన్నాయి
2.పీడియాట్రిక్స్ - 11
3.అనెస్తీషియా - 64
4. జనరల్ మెడిసిన్ - 30
5. జనరల్ సర్జన్ - 16
6. ఆర్థోపెడిక్స్ - 12
7. పాథాలజీ - 05
8. ఆప్తాల్మాలజీ - 09
9. రేడియాలజీ - 21
10. సైకియాట్రీ - 02
11. డెర్మటాలజీ - 06
12. ఈఎన్టీ(ENT) - 08
సంబంధిత విభాగాల్లో PG Degree / Diploma / DNB విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జూలై 1 నాటికి 42 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, Ex-service Menకు వయో పరిమితిలో మూడేళ్ల సడలింపు ఇచ్చారు. అప్లై చేసే సమయంలో అభ్యర్థులు రూ. 1500లను పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. వేయిని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును ఏదైనా జాతీయ బ్యాంకులో ‘THE COMMISSIONER, AP VAIDYA VIDHANA PARISHAD’ పేరు మీద డీడీ తీసి పంపించాల్సి ఉంటుంది. డీడీని ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5: 30 గంటలలోగా O/o.Commissioner, APVVP, 4th Floor, B-Block, Himagna Towers, Old NRI college buildings, Gollapudi, Vijayawada Rural, Krishna District, Andhra Pradesh-521225 చిరునామాకు చేరేలా పంపించాల్సి ఉంటుంది.
అప్లై చేయడం ఎలా..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://dmeaponline.com/ వెబ్ సైట్లో ఈ నెల 28లోగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అప్లికేషన్ సమయంలో కావాల్సిన ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అకాడమిక్ మెరిట్, గతంలో పని చేసిన అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 53,500 వరకు వేతనం చెల్లించనున్నారు. మూడేళ్ల ప్రొహిబిషన్ పిరియడ్ అనంతరం వేతన పెంపు ఉంటుంది.
0 Response to "AP Govt Jobs: Good news for the unemployed in AP .. Notification issued to replace those jobs .. Details"
Post a Comment