Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Bank Charges: Details of how many types of charges banks charge from a bank account.

 Bank Charges :బ్యాంక్ ఖాతా నుంచి బ్యాంకులు ఎన్ని రకాల ఛార్జీలు వసూలు చేస్తాయో వివరాలు.

Bank Charges: Details of how many types of charges banks charge from a bank account.

ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కి డబ్బులను ట్రాన్స్ ఫర్ చేస్తున్నప్పడు లిమిట్ అనేది ఉంటుంది. ఇది ఆయా బ్యాంకులను బట్టి ఉంటుంది. ఆ లిమిట్ దాటితే బ్యాంకులు క్యాష్ ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు చేస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే కాదు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ ఛార్జీలు వసూలు చేస్తాయి. 

ఉదాహరణకు నెలకు ఒక బ్యాంకులో రూ.లక్ష వరకు ట్రాన్సాక్షన్స్ ఉచితం అనుకుంటే ఈ లిమిట్ దాటితే మాత్రం ప్రతీ రూ.1000లకు రూ.10 లేదా రూ.150 ఛార్జి వసూలు చేస్తారు.

ఇది కూడా ఆయా బ్యాంకులను బట్టి ఉంటుంది. మీరు ఏటీఎం నుంచి కూడా విత్‌ డ్రా చేసుకుంటే కూడా ఛార్జీలు వసూలు చేస్తాయి బ్యాంకులు. మీకు ఉన్న ఫ్రీ ట్రాన్సాక్షన్స్ లిమిట్ దాటిన తర్వాత ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఛార్జీలు ప్రతీ లావాదేవి రూ.20 నుంచి రూ.50 వరకు ఛార్జీలు చెల్లించాలి. వివిధ బ్యాంకుల ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి.

ప్రస్తుతం బ్యాంక్ ఖాతా ఉన్న వారిలో 90 శాతం వరకు ఏటీఎం డెబిట్ కార్డులను కలిగి ఉన్నారు. అయితే ఒకవేళ ఆకార్డు పోయినట్లయితే కొత్త కార్డు కోసం ఆన్ లైన్ ద్వారా లేదా బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేస్తారు. దానికి కూడా మనం అదనపు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అది రూ.50 నుంచి రూ.500 వరకు ఉంటుంది. ఖాతా తెరిచినప్పుడు మొదటిసారి మాత్రమే ఏటీఎం కార్డు ఉచితంగా వస్తుంది. ఆ తర్వాత కార్డు పోయినా.. కొత్త కార్డు కావాలన్నా ఛార్జీలు తప్పకుండా చెల్లించాలి. మీ అకౌంట్‌లో బ్యాలెన్స్‌ లేకపోతే కూడా బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయి. 

ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్సు ఉండాల్సిందే. రూరల్, అర్బన్, మెట్రో నగరాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ వేర్వేరుగా ఉంటాయి. మీరు ఎవరికైనా చెక్‌ ఇచ్చారంటే అందుకు ఛార్జీలు కూడా ఉంటాయి. ఒక చెక్ క్లియర్ కావడానికి రూ.150 వరకు ఛార్జీలు చెల్లించాలి. 

అయితే రూ.1,00,000 కన్నా ఎక్కువ విలువ ఉన్న చెక్స్‌కి మాత్రమే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. రూ.1,00,000 లోపు చెక్స్‌కి ఛార్జీలు ఉండవు. అంతేకాకుండా మీ అకౌంట్‌లో జరిగే లావాదేవీలపై ఎస్ఎంఎస్‌లు మీ మొబైల్‌కు వస్తుంటాయి. అందుకు కూడా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 

ఎస్ఎంఎస్‌ అలర్ట్స్ పంపడానికి కూడా బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయి. ఈ ఛార్జీలు బ్యాంకును బట్టి మారుతుంటాయి. ఐఎంపీఎస్‌ మనీ ట్రాన్సాక్షన్స్‌ నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌ సేవలు ఉచితంగా ఉంటాయి. ఒక వేళ మీరు అత్యవసరంగా డబ్బులు వేరే వ్యక్తికి పంపాలంటే ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) ద్వారా డబ్బులు పంపితే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు మీరు పంపే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. రూ.1 నుంచి రూ.25 వరకు ఛార్జీలు పడుతుంటాయి.

బ్యాంకు నుంచి ఏవైనా డాక్యుమెంట్స్ పొందాలంటే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు ఏడాదికి ఒకసారి యాన్యువల్ స్టేట్‌మెంట్‌ను ఉచితంగా ఇస్తాయి. డూప్లికేట్ అకౌంట్ స్టేట్‌మెంట్ కావాలంటే రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లించాలి. 

ఇవీ మాత్రమే కాకుండా బ్యాంకులు అనేక రకమైన ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. 

అకౌంట్ క్లోజర్, కొత్త చెక్ బుక్, ఔట్ స్టేషన్ చెక్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, డిమాండ్ డ్రాఫ్ట్స్, రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్, పిన్ రీజెనరేషన్, లాకర్ రెంట్ లాంటి ఛార్జీలు కూడా ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు మీరు మీ బ్యాంకు స్టేట్‌మెంట్‌ను చెక్‌ చేస్తూ ఉండండి. అప్పుడే బ్యాంకులు ఏయే ఛార్జీలు వసూలు చేస్తున్నాయో తెలుస్తుంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Bank Charges: Details of how many types of charges banks charge from a bank account."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0