Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Apply for a scholarship

 ఉపకారవేతనానికి దరఖాస్తు చేసుకోగలరు

Apply for a scholarship

కొవిడ్‌ బారినపడి తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలకు నెలకు రూ. 500 ఉపకారవేతనం వచ్చే అవకాశం ఉందని, దరఖాస్తు చేసుకుంటే లబ్ధిదారుల్ని జిల్లా స్థాయిలో ఎంపిక చేస్తారని ఐసీడీఎస్‌ ఈమని ప్రాజెక్టు సీడీపీవో ఎస్‌వీఎస్‌ శైలజ తెలిపారు. మంగళవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చి నుంచి మే నెలలోపు కరోనాతో తల్లిదండ్రులిద్దరూ చనిపోయి అనాథలుగా మారిన పిల్లలకు రూ. 10 లక్షలు ప్రభుత్వం అందిస్తోందన్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన వారున్నా స్థానిక అంగన్‌వాడీ కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అందులో కొందరిని ఎంపికచేసి ఉపకారవేతనం అందజేస్తామని చెప్పారు. కరోన ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పటికే ఇంటికి ఇస్తున్న రేషన్‌ను ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించినట్లు చెప్పారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ కింద బాలింతలు, గర్భిణులు, ఆరు నెలల నుంచి 36 నెలల పిల్లలకు రేషన్‌, పాలు, గుడ్లు అందజేస్తారన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఉంటాయన్నారు. కేంద్రాలకు వచ్చే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు మధ్యాహ్న భోజనం, పాలు, గుడ్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల నుంచి ఐరన్‌, ఫ్లోరిక్‌ ఆమ్లం, విటమిన్‌ బి12తో కూడిన ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని అంగన్‌వాడీల్లో ఇస్తారని, దీని వల్ల రక్తపీీానత ఉండే వారికి ఎంతోమేలు చేకూరి, ఆరోగ్య వికాసం ఉంటుందన్నారు. ఈమని ప్రాజెక్టు పరిధిలో గర్భిణులు 788 మంది, బాలింతలు 626, మూడేళ్ల లోపు పిల్లలు 2946, మూడు నుంచి ఐదేళ్ల లోపు వాళ్లు 2241 మంది లబ్ధి పొందుతున్నారన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Apply for a scholarship"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0