Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Children do not want those injections .. Experts warn?

పిల్లలకు ఆ ఇంజెక్షన్ లు వద్దు .. హెచ్చరిస్తున్న నిపుణులు ?

Children do not want those injections .. Experts warn?

గత ఏడాది వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పటికి కూడా ప్రభావం చూపుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మందిలో వైరస్ పై సరైన అవగాహన లేకుండా పోయింది. ముఖ్యంగా చిన్న పిల్లలకు కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి చికిత్స అందించాలి అనే దానిపై చాలా మందిలో ఎన్నో అనుమానాలు అపోహలు నెలకొంటున్నాయి. పెద్ద వాళ్లకైతే సాధారణంగా అందరికీ అందించే కరోనా చికిత్స అందిస్తారు. కానీ చిన్నపిల్లలకు అది కూడా 12 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారు కరోనా వైరస్ బారిన పడితే.. ఎలాంటి చికిత్స అందించాలి అనేదానిపై ప్రస్తుతం చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


అయితే కరోనా వైరస్ చికిత్సలో భాగంగా ప్రస్తుతం రేమిడిసివర్ ఇంజక్షన్లు ఎంతో కీలకం గా మారిపోయాయి.

వైరస్ బారినపడి పరిస్థితి విషమించి సమయంలో రేమిడిసివర్ ఇంజక్షను రోగులకు ఇస్తున్నారు. ఇక ఇలా పరిస్థితి విషమించింది రోగులకు ఈ ఇంజెక్షన్లు ఎంతో సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు. పెద్దల వరకు ఈ ఇంజక్షన్లు బాగా పనిచేస్తున్నాయి సరే.. మరి పిల్లల విషయంలో ఈ ఇంజక్షన్లు ఎలాంటి ప్రభావం చూపుతాయి అన్నది ఆసక్తికరంగా మారిపోయింది . ఈ క్రమంలోనే రేమిడిసివర్ ఇంజక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఇటీవలే చిన్నారులకు కరోనా చికిత్స విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా వైరస్ చికిత్సలో రేమిడిసివర్ ఇంజెక్షన్ ల వాడకం కేవలం పెద్దవాళ్లకు మాత్రమేనని... పిల్లలకు అసలు ఇవ్వదు అని సూచించింది. అంతేకాకుండా సిటీ స్కాన్ కూడా అవసరమైతే తప్ప చేయించవద్దు అంటూ హెచ్చరించింది. లక్షణాలు లేని.. స్వల్ప లక్షణాలు ఉన్న చిన్నారులకు కరోనా వైరస్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం కూడా ఏమాత్రం మంచిది కాదు హెచ్చరించింది. కొన్ని రోజుల్లో థర్డ్ వేవ్ మొదలవబోతోంది అని నిపుణులు హెచ్చరిస్తూన్న నేపథ్యంలో ఇక ప్రస్తుతం అందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి మార్గదర్శకాలను విడుదల చేసినట్లు తెలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Children do not want those injections .. Experts warn?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0