Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Coronavirus: Children are less likely to get coronavirus when schools are open.

 Coronavirus : స్కూల్స్ తెరిచినా పిల్లలకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువ .. ప్రముఖ వైద్యులేమంటున్నారో వివరణ.

Coronavirus: Children are less likely to get coronavirus when schools are open.

Coronavirus: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. ఒక వైపు వ్యాక్సినేషన్‌, ఇక వైపు లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు. ప్రస్తుతం జూలై 1వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించాలని నిన్న తెలంగాణ కేబినెట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో కరోనా కట్టడికి కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే జూలై 1వ తేదీ నుంచి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లవచ్చని, కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను తెరవాలని ప్రభుత్వం ప్రకటించింది.

అయితే విద్యాసంస్థలు తెరవనున్న నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల పాఠశాలలకు పంపించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికే థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతుండటంతో తాము పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు సిద్ధంగా లేమనే చెబుతున్నారు.

అయితే థర్డ్ వేవ్‌లో కరోనా పిల్లలపై అధిక ప్రభావం చూపించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతుండగా మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే విద్యాసంస్థలు తెరవనున్న నేపథ్యంలో పిల్లలకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఆందోళనకు గురవుతున్న క్రమంలో.. పిల్లలకు కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రముఖ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పెద్దల్లో గొంతులోకి వెళ్లిన వైరస్‌.. గొంతులో ఉండే ఓ సాసర్‌ లాంటి అవయవం ఆ వైరస్‌ను వెంటనే పట్టేసుకుంటుందని, కానీ పిల్లల్లో ఆ అవయవం పెద్దగా అభివృద్ధి చెంది ఉండదని, అందుకే వైరస్‌ను పట్టుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, అందుకే పిల్లల్లో వైరస్‌ సోకే ప్రమాదం చాలా తక్కువ అని చెబుతున్నారు. విద్యాసంస్థలు తెరిచినా ఎలాంటి ప్రమాదం ఉండదని, పాఠశాల గదుల్లో భౌతిక దూరం పాటిస్తూ తరగతుల నిర్వహించుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. అంతేకాదు పాఠశాలల్లో అధ్యాపకులతో పాటు పిల్లలకు మాస్కులు ధరించడం తప్పనిసరి అని, ఇలాంటి చర్యలు తీసుకుంటే పిల్లలకు కరోనా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఎలాంటి ఆందోళన చెందవద్దని చెబుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Coronavirus: Children are less likely to get coronavirus when schools are open."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0