Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Credit card is good .. Personal loan is good!

 క్రెడిట్ కార్డ్ మంచిదా లేక పర్సనల్ లోన్ మంచిదా !

  • పర్సనల్‌ లోన్‌ కి, క్రెడిట్‌ కార్డ్‌ ల మధ్య తేడా
  • అవగాహన ఉండాలన్న ఆర్ధిక నిపుణులు
  • లేదంటే అప‍్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక

 మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరు మనీ సేవ్‌ చేసుకోవడం చాలా అవసరం. అలా కాకుండా మనకు ఏదైనా ఆర్ధిక ఇబ్బందులు తలెత్తితే బంధువులు ఉన్నారులే..! వాళ‍్లే చూసుకుంటారు. "ఇప్పుడంటే ఇలా ఉన్నాం. ఎల్లకాలం ఇలా ఉండం కదా. కాలం కలిసొస్తే మనం డబ్బుల‍్ని సంపాదిస్తాం. వాళ్లకు అవసరం అయినప్పుడు మనమే ఆదుకుందాం". ఇదిగో ఇలాంటి అజాగ్రత్తలే మనల్ని అగాథంలోకి నెట్టేస్తాయి. అందుకే మనీ మేనేజ్మెంట్‌ గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

ముఖ్యంగా ఏ బ్యాంకులో లోన్‌ తీసుకుంటే ఎంత ఇంట్రస్ట్‌ పడుతుంది. ఎలాంటి సమయాల్లో రుణాలు తీసుకోవాలి. క్రెడిట్ కార్డ్ లను ఎప్పుడు, ఎలా ఉపయోగించాలనే విషయాలపై అంచనా ఉండాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం పర్సనల్‌ లోన్‌, క్రెడిట్‌ కార్డ్‌లను ఎప్పుడు తీసుకోవాలి. వాటిని ఎలా వినియోగించాలో తెలుసుకుందాం.

పర్సనల్‌ లోన్‌, క్రెడిట్‌ కార్డ్‌ల మధ్య తేడా
క్రెడిట్ కార్డులను రొటేషనల్‌ పద్దతిలో వినియోగిస్తాం. ఉదాహరణకు జనవరి 1వ తేదీన క్రెడిట్‌కార్డ్‌ నుంచి కొంత అమౌంట్‌ అవసరానికి వినియోగించుకున్నాం అనుకోండి. తీసుకున్న మొత్తాన్ని నిర్ణీత సమయంలో పే చేయాల్సి ఉంటుంది. అదే పర్సనల్‌ లోన్‌ పెద్దమొత్తంలో పిల్లల చదువుల కోసం, ట్రీట్మెంట్‌ కోసం, ఇంటి నిర్మాణ పనుల లాంటి వాటి కోసం పర్సనల్‌ లోన్ తీసుకోవచ్చు. బ్యాంక్‌ లు తక్కువ వడ్డీ రేట్లకే అందిస్తాయి. తీసుకుంటే..ఆ మొత్తాన్నికొన్ని సంవత్సరాల పాటు వాయిదా పద్దతుల్లో చెల్లించుకోవచ్చు. లేదంటే ఒకే సారి చెల్లించుకోవచ్చు.

పర్సనల్‌ లోన్‌ ఎప్పుడు తీసుకోవాలి?
పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అనుకున్నప్పుడే పర్సనల్‌ లోన్‌ గురించి ఆలోచించాలి. అలా కాకుండా కార్‌ రిపేర్‌ చేయించాలి, ఇల్లు బాగు చేయించాలని రుణం తీసుకునేందుకు ప్రయత్నించొద్దు. ఒకవేళ మీకు పెద్దమొత్తంలో కావాలనుకుంటే పర్సనల్‌ లోన్ తీసుకోవచ్చు. బ్యాంక్‌ లు తక్కువ వడ్డీ రేట్లకే అందిస్తాయి.

క్రెడిట్ కార్డును ఎప్పుడు ఉపయోగించాలి
క్రెడిట్ కార్డులు తక్కువ బడ‍్జెట్‌ లో ఇంట్లో కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయడానికి, షాపింగ్‌ చేయడానికి క్రెడిట్‌ కార్డ్‌ లను వినియోగిస్తారు. వినియోగించిన మొత్తాన్ని వెంటనే చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ పేమెంట్‌ నిర్ణీత గడువులోపు పే చేయాలి. లేదేంటే ఇంట్రస్ట్‌ ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. చెల్లించినప్పుడే అప్పు అనే ఊబికి దూరంగా ఉండొచ్చు. ఈ పద్ధతిని పాటిస్తే మీరు చెల్లించిన ఇంట్రస్ట్‌ మొత్తాన్ని తిరిగి రివార్డ్ రూపంలో పొందవచ్చు.

క్రెడిట్ కార్డ్‌తో ప్రమాదం ఏంటంటే?
క్రెడిట్ కార్డుల వల్ల అతిపెద్ద ప్రమాదం ఏంటంటే? కార్డును స్వైప్ చేసి వస్తువుల్ని ఈజీగా కొనుగోలు చేస్తుంటారు. ఇది మీకు లేనిపోని తలనొప్పుల్ని తెచ్చిపెడుతుంది. షాపింగ్‌ చేసే సమయంలో క్రెడిట్‌ కార్డ్‌ ఉందని అవసరానికి మించి ఖర్చు చేస్తుంటాం. దీంతో క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీలు పెద్ద మొత్తంలో ఇంట్రస్ట్‌ను వసూలు చేస్తాయి. ఒకవేళ మీకు ఒకేసారి చెల్లించే స‍్తోమత లేనప్పుడు ఈఎంఐ గా మార్చుకోవచ్చు. అది కూడా కట్టలేకపోతే అధిక వడ్డీ, చక్రవడ్డీతో పాటూ అప్పు తీర్చేందుకు సంవత్సరాల పాటు శ్రమించాల్సి ఉంటుంది. కాబట్టి క్రెడిట్‌ కార్డ్‌ ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Credit card is good .. Personal loan is good!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0