Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Green signal for replacement of aided teacher posts

ఎయిడెడ్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

Green signal for replacement of aided teacher posts

  • హైకోర్టు ఉత్తర్వులతో ఎట్టకేలకు చర్యలు
  • తొలుత పోస్టుల రేషనలైజేషన్‌.. సర్దుబాటు
  • అప్పటికీ పోస్టులు మిగిలితే నియామకాలు
  • ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి 1:40 ఉండాలి
  • పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు

ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల అమలు దిశగా చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు(జీవో 37) జారీ చేశారు.

ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి 1:40 ఉండేలా తొలుత ఎయిడెడ్‌ పాఠశాలల్లోని టీచర్‌ పోస్టులను రేషనలైజ్‌ చేయాలి. ఇందుకు గాను 2020-21 విద్యా సంవత్సరం పాఠశాల చివరి పనిదినాన్ని(ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఏప్రిల్‌ 19, ఉన్నత పాఠశాలలకు ఏప్రిల్‌ 30) పరిగణనలోకి తీసుకోవాలి.    విద్యార్థుల సంఖ్య, మంజూరైన పోస్టుల ఆధారంగా మిగులు ఉపాధ్యాయులను ఎక్కడ అవసరమో గుర్తించి ఆయా పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. జిల్లా పరిధిలోనే ఈ సర్దుబాటు/బదిలీ ప్రక్రియ చేపడతారు. ఆ తర్వాత కూడా పోస్టులు మిగిలితే, అవసరాన్ని బట్టి ఎయిడెడ్‌ పాఠశాలల్లో నియామకాలు చేపడతారు. ఈ నియామకాలను ఉన్నత పాఠశాలలకు ఆర్‌జేడీలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు డీఈవోలు చేపడతారు.

ఈ ఉత్తర్వులపై పాఠశాల విద్యా డైరెక్టర్‌ వెంటనే చర్యలు చేపట్టి, ప్రక్రియ పూర్తయిన వెంటనే పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, విద్యాహక్కు చట్టానికి అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. అలాగే 1994 జనవరి ఒకటో తేదీ నాటి ఉత్తర్వుల్లోని రూల్‌ 10(12)ప్రకారం స్టాఫ్‌ ప్యాట్రన్‌ మేరకు అదనపు ఉపాధ్యాయులను గుర్తించాలి. వారిని అవసరం ఉన్న ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేయాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Green signal for replacement of aided teacher posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0