Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Let’s learn some interesting things based on our blood type.

 మన బ్లడ్ గ్రూప్ ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

Let’s learn some interesting things based on our blood type.

బ్లడ్ గ్రూప్ ఆధారంగా ఎవరి పర్సనాలిటీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా నాలుగు బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఏ, బి, ఎబి, ఓ. అయితే ఒక్కొక్కపెర్సనాలిటీ ఒక్కోలాగా ఉంటుంది. ఇది బ్లడ్ గ్రూప్ ఆధారంగా ఉంటుంది.

జపాన్ లో అయితే పెళ్లి చేసుకోవడానికి ఈ బ్లడ్ గ్రూప్ ఆధారంగా ముందు పర్సనాలిటీ తెలుసుకుని ఆ తర్వాత పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమవుతారు. అయితే ఏ గ్రూప్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం..

A గ్రూప్:

బ్లడ్ గ్రూప్ A వాళ్ళు ఎలా ఉంటారు అంటే.. వీళ్ళు చాలా సెన్సిటివ్ గా, ఎమోషనల్ గా ఉంటారు.

అదే విధంగా ఎంతో తెలివిగా వాళ్ళు రాణిస్తారు. చాలా శాంతంగా, సహనంతో ఈ బ్లడ్ గ్రూపు వాళ్ళు ఉంటారు.

ఎవరితోనూ గొడవలకి దిగరు. అయితే వీళ్ళు చాలా సెన్సిటివ్ గా వుంటారు. రూల్స్ బ్రేక్ చేయకూడదని ఎవరిని ఏమి అనకూడదు అని వాళ్లు అంటారు.

అలానే వీళ్ళు చాలా శుభ్రంగా ఉంటారు. ఓసిడి ఎక్కువ ఉండే వాళ్ళు బ్లడ్ గ్రూపు ఏ వాళ్ళు ఉంటారు. దయ, పిరికితనం, శ్రద్ధ, మొండి పట్టుదల, మర్యాద, సున్నితం, బాధ్యత, ఆత్రుత వీళ్లల్లో ఉంటాయి.

B గ్రూప్:

ఇక బి గ్రూప్ వాళ్ళు ఎలా ఉంటారు అంటే.. వీళ్ళు చాలా క్రియేటివ్ గా ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అలానే వీళ్ళు చాలా మంచి వాళ్ళు అయ్యి ఉంటారు.

మల్టీటాస్కింగ్ చేస్తూ ఉంటారు. కొంచెం స్వార్ధపరులు అయి ఉంటారు. క్యూరియస్, స్ట్రాంగ్, రిలాక్స్డ్, క్రియేటివిటీ, చురుకుతనం వీళ్లల్లో ఉంటుంది.

AB బ్లడ్ గ్రూప్:

వీళ్లు ఎక్కువగా సిగ్గు పడతారు. వీళ్ళ పర్సనాలిటీ కొత్త వాళ్ల దగ్గర మరొక లాగా ఉంటుంది. వీళ్లది మిక్సిడ్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. ప్రపంచంలోకెల్లా వీళ్ళ బ్లడ్ గ్రూప్ చాలా అరుదుగా ఉంటుంది.

ఈ గ్రూప్ వాళ్ళు సులువుగా ఎవరితోనైనా స్నేహం చేసేయగలరు. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం కష్టం. జాలి, దయ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా కూల్ గా వుంటారు.

O గ్రూప్:

వీళ్ళు సాధించడానికి వీళ్ళు ఒక స్టాండర్డ్ ని సెట్ చేసుకుని ఉంటారు. వీళ్లల్లో లీడర్ షిప్ క్వాలిటీస్ బాగా ఉంటాయి. కానీ ఇతరులు స్వార్ధపరులు అనుకునే లాగ వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు మరియు నెమ్మదిగా ఉంటారు.

జాలి, దయ ఎక్కువగా ఉంటుంది మంచి ప్రేమని వీళ్ళు చూపిస్తారు. నాయకత్వం, తేలికగా వెళ్లడం, సానుకూల దృక్పథం, నమ్మకంగా, ప్రశాంతంగా, అవుట్గోయింగ్, జాగ్రత్తగా, నమ్మకంగా ఈ గ్రూప్ వాళ్ళు వుంటారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Let’s learn some interesting things based on our blood type."

Post a Comment