Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Personal loan .. Completely online details.

పర్సనల్‌ లోన్‌.. పూర్తిగా ఆన్‌లైన్‌ వివరాలు.

Personal loan .. Completely online details.

కరోనా కాలంలో అప్పు కూడా ఆన్‌లైన్‌లో తీసుకోవడం ఉత్తమం. డిజిటల్‌ రుణం.. దరఖాస్తు సులభం. ప్రాసెసింగ్‌ వేగవంతం. సురక్షితం కూడా. పూర్తిగా డిజిటల్‌ మార్గంలో వ్యక్తిగత రుణం పొందడమెలాగో తెలుసుకుందాం.

ఎవరు అర్హులు?

వేతన జీవులు, వృత్తి నిపుణులు, వ్యాపారులతో పాటు సంప్రదాయ మార్గంలో వ్యక్తిగత రుణం తీసుకునేందుకు అర్హులైన వారందరూ డిజిటల్‌ మార్గంలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు, ఎల్లలు చెరిపేసే డిజిటల్‌ మార్గంలో ఎవరైనా, ఎక్కడి నుంచైనా రుణం తీసుకునే వీలుంటుంది. 

 ఎవరు ఆఫర్‌ చేస్తున్నారు..?

అన్ని ప్రముఖ బ్యాంక్‌లు, ఎన్‌బీఎ్‌ఫసీలు, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌) కంపెనీలు డిజిటల్‌ రుణాలు ఆఫర్‌ చేస్తున్నాయి. 

 వడ్డీ ఎంత ?

ఆఫ్‌లైన్‌ రుణాలతో పోలిస్తే ఆన్‌లైన్‌ రుణాలే కాస్త చౌక. అయితే, వడ్డీ రేటు మాత్రం దరఖాస్తుదారు ఆదాయం, క్రెడిట్‌ స్కోరు, రుణ మొత్తం వంటి వివరాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వ్యక్తిగత రుణాలపై వార్షిక వడ్డీ రేటు 10.25 శాతం నుంచి 36 శాతం వరకు ఉంటుంది. కాబట్టి, మార్కెట్లో అందుబాటులో ఉన్న పలు ఆఫర్లను పోల్చి చూసుకున్నాక మీకు తగిన రుణ పథకాన్ని ఎంచుకోవడం మేలు.

ఏమేం అవసరం?

మీ వ్యక్తిగత వివరాలు, ఆదా యం, చిరునామా, పాన్‌కార్డు, క్రెడిట్‌ స్కోర్‌కు సంబంధించి సరైన, తాజా ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. వీలైనంత తక్కువ వడ్డీ రేటుకు వేగంగా రుణం పొందేందుకు ఇదెంతో కీలకం. లోన్‌ ప్రాసెసింగ్‌లో భాగంగా కేవైసీ (కస్టమర్‌ వివరాల ధ్రువీకరణ) ప్రక్రియను పూర్తి చేసేందుకు మీ పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు తదితర భౌతిక పత్రాలు తప్పనిసరి. ఎందుకంటే, ఆన్‌లైన్‌ రుణ దరఖాస్తుతో పాటు ఈ పత్రాలనూ స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.  

పొందడమెలా..?

మీ బ్యాంక్‌ అకౌంట్‌, ఆధార్‌తో మొబైల్‌ నంబరును అనుసంధానించారో లేదో సరి చూసుకోండి. ఒకవేళ అనుసంధానించని పక్షంలో  ముందు ఆ ప్రక్రియను పూర్తి చేయండి

మీరు రుణదాతకు సమర్పించబోయే బ్యాంక్‌ అకౌంట్‌కు నెట్‌బ్యాంకింగ్‌ వసతి కలిగి ఉండాలి. లేని పక్షంలో నెట్‌ బ్యాంకింగ్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి 

బ్యాంక్‌ ఆకౌంట్‌, ఆధార్‌తో అనుసంధానించిన మొబైల్‌ నంబరునే రుణ దరఖాస్తులో పొందుపరచాలి

ప్రస్తుతం మీరు నివసిస్తున్న చిరునామా మీ బ్యాంక్‌ ఖాతా బుక్‌, ఆధార్‌లోనూ అప్‌డేట్‌ అయి ఉండాలి. 

ఒకవేళ మీరు అధికారిక ఈ-మెయిల్‌ అడ్రస్‌ కలిగి ఉంటే, దాని ద్వారా మెయిల్స్‌ రిసీవ్‌ చేసుకోవడంతో పాటు పంపగలిగే వెసులుబాటు కలిగి ఉండాలి. 

పైన పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా మీరు వివరాలు సమర్పించని పక్షంలోనూ మీరు రుణ మంజూరుకు అర్హులవుతారు. కానీ, రుణదాత మీ వివరాలను భౌతికంగా తనిఖీ జరిపి సంతృప్తి చెందితేనే రుణం పొందడం సాధ్యపడుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Personal loan .. Completely online details."

Post a Comment