Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Up to Rs 2 lakh insurance free for Jan Dhan account holders..how about details?

 జన్ ధన్ అక్కౌంట్ ఉన్న వారికి  రూ .2 లక్షల వరకు ఇన్షూరెన్స్ ఫ్రీ..ఎలాగో వివరాలు ?

Up to Rs 2 lakh insurance free for Jan Dhan account holders..how about details?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) రుపే డెబిట్ కార్డులను ఉపయోగించే జన ధన్ ఖాతాదారులకు రూ .2 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా కవరేజ్‌ అందిస్తుంది. డెబిట్ కార్డ్ వినియోగదారులు ఇప్పుడు ఆక్సిడెంటల్ డెత్ ఇన్షూరెన్స్, పర్చేస్ ప్రొటెక్షన్ కవర్ తో సహ ఇతర ప్రయోజనాలు పొందేందుకు కూడా అర్హులు.

2014లో ప్రారంభమైన ప్రధాన్ మంత్రి జన-ధన్ యోజన ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ సేవింగ్స్, డిపాజిట్ ఖాతాలు, చెల్లింపులు, క్రెడిట్, భీమా, పెన్షన్ వంటివి ఆర్థికంగా వెనకబడిన ప్రజలకు సరసమైన రీతిలో వర్తించేలా చేస్తుంది.

నో యువర్ కస్టమర్ (కెవైసి) పత్రాలను అందించడం ద్వారా ఆన్‌లైన్‌లో జన ధన్ ఖాతాను తెరవవచ్చు. ప్రాథమిక పొదుపు ఖాతాను జన ధన్ యోజన ఖాతాకు బదిలీ చేయడానికి ఒక ఆప్షన్ కూడా ఉంది.

జన ధన్ ఖాతా ఉన్నవారు మొదట బ్యాంకు నుండి రుపే పిఎంజెడివై కార్డు పొందాల్సి ఉంటుంది. 28 ఆగస్టు 2018 ముందు జన ధన్ ఖాతాలపై జారీ చేసిన రుపే పిఎమ్‌జెడివై కార్డులకు రూ .1 లక్ష బీమా కలిగి ఉంటాయి. 28 ఆగస్టు 2018 తర్వాత జారీ చేసిన రూపే కార్డులకు ఆక్సిడెంట్ కవర్ బెనిఫిట్ రూ .2 లక్షల వరకు లభిస్తుంది.

అర్హత: రూపే డెబిట్ కార్డును ఉపయోగించి ప్రమాదానికి 90 రోజుల ముందులోగా జాన్ ధన్ ఖాతాదారులు ఇంట్రా అండ్ ఇంటర్ బ్యాంక్ రెండింటిలోనూ ఏదైనా ఛానెల్‌ ద్వారా ఫైనాన్షియల్ లేదా నాన్ ఫైనాన్సియల్ లావాదేవీలు చేసి ఉండాలి.

ఏదైనా ప్రమాదం భారతదేశం వెలుపల జరిగినా కూడా పర్శనల ఆక్సిడెంట్ పాలసీ వర్తిస్తుంది. అయితే అవసరమైన డాక్యుమెంటేషన్ సమర్పించి తరువాత బీమా చేసిన మొత్తం భారత కరెన్సీలో చెల్లించబడుతుంది.

జన్ ధన్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలంటే ?
మీరు జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయకపోతే మీ సమీప ఎస్‌బిఐ బ్యాంకుకు వెళ్లి జనధన్ ఫారం పూర్తి చేయాలి. అందులో మీ పేరు, మొబైల్ నంబర్, చిరునామా, వ్యాపారం, ఉపాధి, వార్షిక ఆదాయం ఆధారపడిన వారి సంఖ్య, నామిని మొదలైనవి నమోదు చేయాల్సి ఉంటుంది. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఎవరైనా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ సహ కేవైసీకి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించాలి.ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

క్లెయిమ్‌ చేయడానికి కావాల్సిన పత్రాలు
1) క్లెయిమ్ చేసుకునే పత్రంపై సంతకం
2) మరణ ధృవీకరణ ప్రతం
3) ప్రమాదం గురించి వివరణ ఇచ్చే పోలీసు స్టేషన్‌ ఎఫ్‌ఐఆర్‌ కాపీ.
4) మరణం తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్
5) కార్డుదారుని నామినీగా ఉన్న వ్యక్తి ఆధార్‌ కాపీ
6) జన్‌ధన్‌ కార్డు జారీ చేసిన బ్యాంకు నుంచి అధికారికంగా సంతకం చేసిన పత్రం. కస్టమర్‌కు జారీ చేసిన రూపే కార్డు నెంబర్‌ తప్పనిసరి. నామినీ పేరుపై ఉన్న బ్యాంకింగ్‌ వివరాలు.

డాక్యుమెంట్స్ సమర్పించిన తేదీ నుంచి పది పని రోజులలో క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ ప్రయోజనాలు 31 మార్చి 2022 వరకు బెనిఫిట్స్‌ అందుకోవచ్చు. కాగా, న్యూ ఇండియా అస్యూరెన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ రూపే పీఎమ్‌ జేడీవై కార్డుల కోసం ఎన్‌పీసీఐతో బీమా భాగస్వామిగా కొనసాగుతోంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Up to Rs 2 lakh insurance free for Jan Dhan account holders..how about details?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0