Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

12 to Inter Secondary Online Classes

12 నుంచి ఇంటర్‌ సెకండియర్‌ ఆన్‌లైన్‌ తరగతులు

12 to Inter Secondary Online Classes

2021–22 తాత్కాలిక విద్యా క్యాలెండర్‌ను ప్రకటించిన బోర్డు

ఏపీలో ఇంటర్‌ సెకండియర్‌ ఆన్‌లైన్‌ తరగతులు ఈ నెల 12 నుంచి ఆరంభం కానున్నాయి. ఇంటర్‌ సెకండియర్‌ 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక అకడమిక్‌ క్యాలెండర్‌ను ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రకటించింది. ఏపీలోని అన్ని కాలేజీలకు ఈ మేరకు సమాచారాన్ని పంపింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 213 పని దినాలు ఉండనున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బంది ఈ నెల 12 నుంచి కాలేజీలకు హాజరు కావాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

అకడమిక్‌ క్యాలెండర్‌ వివరాలు..

  • ఈ నెల 12 నుంచి అక్టోబర్‌ 16 వరకు అకడమిక్‌ ఇయర్‌ ఫస్ట్‌ టర్మ్‌  
  • ఆగస్టులో మొదటి యూనిట్‌ టెస్టు
  • సెప్టెంబర్‌లో రెండో యూనిట్‌ టెస్టు అక్టోబర్‌ 1 నుంచి 8 వరకు అర్థ సంవత్సర పరీక్షలు
  • అక్టోబర్‌ 9 నుంచి 17 వరకు ఫస్ట్‌ టర్మ్‌ సెలవులు
  • అక్టోబర్‌ 18 నుంచి కాలేజీల పునఃప్రారంభం
  • అక్టోబర్‌ 18 నుంచి 2022 ఏప్రిల్‌ 23 వరకు అకడమిక్‌ ఇయర్‌ సెకండ్‌ టర్మ్‌
  • నవంబర్‌లో 3వ యూనిట్‌ టెస్టు
  • డిసెంబర్‌లో 4వ యూనిట్‌ టెస్టు
  • 2022 జనవరి 8 నుంచి 16 వరకు సెకండ్‌ టర్మ్‌ సెలవులు
  • జనవరి 17న కాలేజీల పునఃప్రారంభం
  • ఫిబ్రవరి మొదటి వారంలో ప్రీ ఫైనల్‌ పరీక్షలు
  • ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రాక్టికల్స్‌
  • మార్చి మొదటి వారంలో థియరీ పరీక్షలు ఆరంభం  ఏప్రిల్‌ 23వ తేదీ చివరి పనిదినం
  • ఏప్రిల్‌ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
  • మే చివరిలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు
  • జూన్‌ 1 నుంచి 2022–23 విద్యా సంవత్సరానికి కాలేజీల పునఃప్రారంభం
  • అన్ని ఆదివారాలు, రెండో శనివారాలు సెలవు దినాలు.  


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "12 to Inter Secondary Online Classes"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0