Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A fine of Rs 20,000 if allowed without masks: AP government orders .. !!

 మాస్కులు లేకుండా అనుమతిస్తే రూ 20 వేల జరిమానా : ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు .

A fine of Rs 20,000 if allowed without masks: AP government orders .. !!

ఏపీలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్దమైంది. కేసుల తీవ్రత తగ్గుతున్న క్రమంలో ఎక్కడా ఉదాసీనంగా వ్యవహరించకూడదనే ఉద్దేశంతో..కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా..ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఇదే సమయంలో చర్యలకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా.. రాష్ట్రంలోని కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్కులు లేని వారిని అనుమతిస్తే రూ.10వేల నుంచి రూ.20వేల వరకు జరిమానా విధిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీచేశారు. జరిమానా మొత్తాన్ని అక్కడి పరిస్థితుల ఆధారంగా ఖరారు చేస్తారని తెలిపారు.

అలాగే రెండుమూడు రోజులపాటు సంబంధిత సంస్థను మూసివేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా వాట్సప్‌ నెంబరును ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నిత్యం రాత్రి 10 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ వరకు కర్ఫ్యూ ఉంటుందన్నారు.మాస్కులు ధరించని వారి నుంచి రూ.100 జరిమానా విధించే అధికారాన్ని ఎస్‌ఐలు సహా ఆపై పోలీసు అధికారులకు అప్పగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఈ అధికారం వైద్యాధికారులకు మాత్రమే ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A fine of Rs 20,000 if allowed without masks: AP government orders .. !!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0