Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP High Court Jobs

 AP High Court Jobs : ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు .. ఇలా దరఖాస్తు చేసుకోగలరు.

AP High Court Jobs


ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జడ్జీలకు, రిజిస్ట్రార్ లకు సహాయకులుగా ఉండే కోర్టు మాస్టర్లు, పర్సనల్ సెక్రటరీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.37,100 వరకు వేతనం చెల్లించనున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు ఫీజుగా రూ. 750, రూ. 350ని చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఈ నెల 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆర్ట్స్/సైన్స్/కామర్స్ సబ్జెక్టులో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోచ్చని నోటిఫికేషన్లో తెలిపారు. దీంతో పాటు ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నీకల్ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ నిమిషానికి 180 పదాలు, నిమిషానికి 150 పదాల ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులు వయస్సు జులై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తులను రిజిస్ట్రార్(అడ్మినిస్ట్రేషన్), హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేలపాడు, అమరావతి, గుంటూరు-522237 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP High Court Jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0