Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Best Tips to Avoid Cellphone Radiation

 సెల్‌ఫోన్ రేడియేషన్ నుండి తప్పించే బెస్ట్ టిప్స్

Best Tips to Avoid Cellphone Radiation

మహమ్మారి కారణంగా మనం ఆన్లైన్ యుగంలో కొనసాగుతున్నాము. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఎంటర్టైన్మెంట్ లేదా ఆన్లైన్ క్లాసులే కావచ్చు ఎటువంటి అవసరానికైనా సెల్ఫోన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే, సెల్ఫోన్ ఫోన్లను వాడకం వలన మనకు హానికలిగించే రేడియషన్ ప్రభావం ఎంతోకొంత మనకు పొంచి ఉంటుంది.

వాస్తవానికి, సెల్ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ ను పూర్తిగా నివారించలేము. కానీ, దీన్ని పూర్తిగా నివారించలేకపోయినా సరైన పద్దతిలో సెల్ఫోన్ వాడడం వలన దీన్నీచాల వరకు తగ్గించవచ్చు. ఈ క్రింద ఇచ్చిన 5 మార్గాలను పాటించడం ద్వారా కొంత వరకు ఫోన్ వెదచల్లే రేడియేషన్ భారి నుండి రక్షించవచ్చు. అంతేకాదు, మీతో పాటుగా మీ చుట్టూఉండే వారిని దీని బారి నుండి కాపాడవచ్చు.

1. ఆల్టర్నేటివ్

ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా సెల్ ఫోన్ వాడుతున్నాము కాబట్టి, వీలైనంత వరకు కాలింగ్ కి బదులుగా టెక్స్ట్ మెసేజిలు పంపడం, లేదా సెల్ ఫోన్ నుండి కాల్స్ చేయాల్సివచ్చినపుడు బ్లూటూత్ హెడ్ సెట్ లేదా, ఇయర్ ఫోన్స్ వాడడం ద్వారా చాలా వరకు రేడియేషన్ నుండి తప్పిచుకోవచ్చు. ఎలాగంటే, ఫోన్ మాట్లాడేటప్పుడు మన మెదడుకు ద్గగరగా ఫోనులో వుండే యాంటెన్నాఉంటుంది కాబట్టి అది నేరుగా మన మెదడు పైన ప్రభావాన్ని చూపిస్తుంది. పైన తెలిపిన ప్రత్యామ్నాయాల వలన ఫోన్ మన తలకు దూరంగా ఉంటుంది కాబట్టి చాల వరకు రేడియేషన్ తప్పించుకోవచ్చు.

2. అనవసర వాడకం

అనవసర ఫోన్ వాడకాన్ని తగ్గిచుకోవడం : "అతిగా తింటే అమృతం కూడా విషం అవుతుంది" అనే సామెత ఇక్కడ కచ్చితంగా నిజమవుతుంది. అతిగా ఫోన్ వాడకం, మీకు ఎనలేని నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కేవలం, రేడియేషన్ ప్రమాదమే కాకుండా వత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమితనం వంటి మరెన్నో రుగ్మతలకు కారణమవుతుందని U.S కి చెందిన, నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) 2011 వ సంవత్సరంలోనే దీని గురించి తెలిపింది. కాబట్టి, మీకు అవసంరంలేని సమయంలో వీలైనంత వరకు ఫోనుకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.

3. రాత్రి సమయం

రాత్రి సమయంలో ఫోన్ ఆఫ్ చేయండి : ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా వారి ఫోన్లను ఒక అలారం గడియారంలా వాడుతున్నారు. ఇది చాల చిన్న విషయం కదా, అనుకుంటున్నారా ? కాదు, మీరు అలారం పెట్టి ఫోన్ మీ తల దగ్గర పెట్టి పడుకుంటారు , అప్పుడు అత్యధికమైన రేడియేషన్ మీరు అందుకుంటారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఫోన్ ఏరోప్లేన్ మోడ్ లో వున్న సరే దానిలోని యాంటెన్నా మరియు బ్యాటరీ రేడియేషన్ ఇస్తాయి కాబట్టి ఫోన్ ఆఫ్ చెయ్యడమే సరైన పరిష్కారం.

4. ఫోన్ సిగ్నల్

సిగ్నల్ సరిగ్గా లేనపుడు ఫోన్ వాడకం తగ్గించాలి : ఫోన్ లో సిగ్నల్ వీక్ గా ఉన్నపుడు వీలయినంత వరకూ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. ఎందుకంటే, సిగ్నల్ వీక్ గా ఉన్నపుడూ మన ఫోన్ లోనీ యాంటెన్నాసిగ్నల్ కోసం అత్యదికంగా తరంగాలను విడుదల చేస్తుంది కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తవహించండి.

5. 24 గంటలు ఫోన్ వద్దు

మీతో మీ ఫోన్ను అంటిపెట్టుకుని ఉండటాన్ని తగ్గించండి: ఫోన్ను జేబులో లేదా పౌచ్ తో పాటుగా ఎల్లపుడు మీతోనే అంటిపెట్టుకుని ఉంచుకోవడాన్నితగ్గించండి. ఇలా మీతో పాటుగా ఎల్లప్పుడు ఫోన్ పీటుకోవడం ద్వారా మీకు రేడియేషన్ ప్రభావం ఉంటుంది. కాబట్టి , మీఫోనుతో పనిలేనప్పుడు మీ నుండి కొంత దూరంలో ఉండేలా చూసుకోండి.

పైన చెప్పిన విధంగా చేయడంవలన, రేడియేషన్ను పూర్తిగా నివారించక పోయినా కూడా చాల వరకు తగ్గించవచ్చు. ఎంత దూరంలో ఉన్నా సరే, మన వారికీ మనం ఎల్లప్పుడూ దగ్గరగా ఉండేలా చేసే టెక్నాలజీ మనకు అందుబాటులో ఉన్నందుకు మనం ఆనందించవచ్చు. కానీ, అతిగా వాడడం వలన కలిగే ముప్పుకు మనమే కారణం అవుతాము

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Best Tips to Avoid Cellphone Radiation"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0