Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Can I eat an egg if I have diabetes? Is it good for the heart?

మధుమేహం ఉంటే గుడ్డు తినొచ్చా? గుండెకు మంచిదేనా? నిపుణుల సలహాలు.

Can I eat an egg if I have diabetes?  Is it good for the heart?

 మధుమేహం (డయాబెటీస్)తో బాధపడుతున్నవారు గుడ్డు తినేందుకు సందేహిస్తున్నారా? అయితే, తప్పకుండా ఈ విషయం తెలుసుకోవల్సిందే. 

గుడ్డు ఆరోగ్యానికి చాలలామంచిదనే విషయం తెలిసిందే. అయితే, మధుమేహంతో బాధపడేవారు గుడ్లు తింటే గుండె జబ్బులు వస్తాయని చాలామంది భావిస్తారు. కానీ, అందులో వాస్తవం లేదని ఓ అధ్యయనంలో తేలింది. గుడ్లు తిననివారి కంటే గుడ్లు తినేవారిలోనే గుండె వ్యాధుల ముప్పు తక్కువట. ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలోనూ గుడ్డు వల్ల గుండె సమస్యలు తగ్గయని అధ్యయనంలో పేర్కొన్నారు.

సిడ్నీ యూనివర్సిటీ’ పరిశోధకులు జరిపిన అధ్యయనం ప్రకారం గుడ్డు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదే. ఏడాదిపాటు వారానికి 12 గుడ్లు చొప్పున తింటే డయాబెటీస్, టైప్-2 డయాబెటీస్‌తో బాధితులకు గుండె జబ్బుల ముప్పు ఉండదట. 3 నెలల క్రితం జరిపిన అధ్యయనంలో కూడా ఇలాంటి ఫలితాలే వెల్లడి కావడం గమనార్హం. 

పరిశోధన ఇలా సాగింది: పరిశోధనలో పాల్గొన్నవారిని మూడు గ్రూపులుగా విభజించారు. వారానికి గరిష్టంగా 12 గుడ్లు, మరికొందరికి వారానికి 2 లేదా ఒక గుడ్డు చొప్పున తినాలని సూచించారు. 3 నెలలపాటు వీరికి గుడ్లు అందించారు. మొదటి గ్రూపు వారికి గుడ్లు తక్కువ, ఎక్కువ మొత్తంలో ఇచ్చారు. రెండో గ్రూపువారికి వెయిట్ తగ్గేలా డైట్‌ ఫుడ్‌ను ఇచ్చారు. ఇక చివరి గ్రూపువారికి ఆరు నెలలు నుంచి 12 నెలల పాటు అదే మోతాదులో గుడ్లను తినాలని సూచించారు. చివరిగా అందరి ఆరోగ్యాన్ని పరిశీలించారు.

ఇదీ ఫలితం: గుడ్లు తిన్నవారిలో గుండె సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ప్రమాద కారకాలేవీ కనపించకపోవడం గమనార్హం. గుడ్లు తీసుకోవడం వల్ల అందులోని ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. గుడ్డు తింటే కళ్లు, గుండె ఆరోగ్యం, రక్తనాళాలకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. గర్భవతులు గుడ్డు తింటే చాలా మంచిదని సూచించారు.

గుడ్డు వల్ల కలిగే ప్రయోజనాలు వివరాలు:

  • కోడిగుడ్ల ద్వారా శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. 
  • గుడ్లలో శరీరానికి కావల్సిన శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్ ‌శాచురేటెడ్ ఫ్యాట్స్ మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి.
  • పొటాషియం, విటమిన్-A, కాల్షియం, ఐరన్, విటమిన్-D, విటమిన్ B6, విటమిన్ B 12, మెగ్నిషియం గుడ్డులో పుష్కలం.
  • గుడ్డు మెదుడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
  • గుడ్డు సొనలో ఉండే కోలిన్‌ అనే పోషక పదార్థం మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 
  • గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. 
  • మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా గుడ్డు కాపాడుతుంది. 
  • జట్టు, గోళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు గుడ్డు ఉపయోగపడుతుంది.
  • గుడ్డులో విటమిన్-A ఉంటుంది. ఇది కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
  • గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి. 
  • నరాల బలహీనత ఉన్న వారు రోజూ గుడ్డును తీసుకోవడం మంచిది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Can I eat an egg if I have diabetes? Is it good for the heart?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0