Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Elementary school mapping completed

ప్రాథమిక పాఠశాలల మ్యాపింగ్‌ పూర్తి

Elementary school mapping completed

  • కొత్త విధానంతో ఆందోళన
  • జీవనం దయనీయమే..
  • చదువుకు దూరం

ఉన్నత పాఠశాలకు 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను మ్యాపింగ్‌ చేసి జాబితాను విద్యా శాఖకు పంపారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు ఉన్నత విద్యాలయాలకు ఒకే ప్రాంగణం, ప్రహరీ పక్కన, సమీప దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల వివరాలను ఎంఈవోల ద్వారా సేకరించారు. ఉన్నత పాఠశాల పరిధిలో 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రైమరీ బడులు 1,637 ఉన్నట్లు గుర్తించారు. వాటిని ఒకే ప్రాంతంలోకి చేర్చి ఉన్నత పాఠశాలలుగా మార్చాలన్నది ప్రభుత్వం నిర్ణయంగా అధికారులు చెబుతున్నారు.

కొత్త విధానంతో ఆందోళన

నూతన జాతీయ విద్యావిధానం ఉపాధ్యాయులను ఆందోళన కలిగిస్తోంది. గత మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ తరుణంలో 3 కి.మీ. పరిధిలోని పాఠశాలల వివరాలు సేకరించడంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ 172 ఉత్తర్వుల ప్రకారం 10+2 స్థానంలో 5+3+3+4 విద్యా విధానం అమల్లోకి రానుంది. అంగనవాడీ, ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల వ్యవస్థను అంచలంచెలుగా మార్పులు చేయనున్నారు. కొత్త విధానంలో అంగన్‌వాడీ కేంద్రాలు ప్రాథమిక పాఠశాలలుగా రూపాంతరం చెందుతాయి. 3, 4, 5 తరగతులు 3-5 కి.మీ. దూరంలో ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు.

జీవనం దయనీయమే..

ప్రీప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేకపోవడంతో పక్క రాష్ట్ట్రాలకు వలస వెళ్తున్నారు. కరోనా కారణంగా ఉపాధి పనులు సైతం తగ్గిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు ఆందోళనగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో తల్లిదండ్రులు 5 కి.మీ. నుంచి 10 కి.మీ. దూరంలో పాఠశాలలకు తమ పిల్లల్ని పంపడం అసాధ్యం. పలు కారణాల దృష్ట్యా ఏటా జిల్లాలోని గ్రామాల్లో బడిబయట పిల్లల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఒక పాఠశాల మూతపడదు.. ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కారని.. ఒక్క టీచర్‌ పోస్టు కూడా తగ్గదని ప్రభుత్వం హామీ ఇస్తోంది. కొత్త విద్యావిధానం వల్ల డ్రాపౌట్లు పెరిగే అవకాశం ఉందని విద్యా నిపుణులు భావిస్తున్నారు.

చదువుకు దూరం

ఉన్నత పాఠశాలలకు ఆవరణ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను మ్యాపింగ్‌ చేసే ప్రక్రియ పూర్తి చేశారు. ఆ వివరాలను గూగుల్‌ ఫామ్‌ ద్వారా ఎంఈవోల నుంచి పాఠశాల విద్యాధికారులకు అందజేశారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు హైస్కూల్‌ ప్రహరీ ఆవరణం మొదలుకుని 3 కి.మీ. పరిధిలో ఉన్నవాటిని సేకరించారు. ప్రాథమికోన్నత పాఠశాలలు కాకుండా హైస్కూల్‌ కాంపౌండ్‌లో 86, వెలుపల 3, 100 మీ. దూరంలో 85, 100 నుంచి 200 మీ. లోపు 85, ఆపైన అర కి.మీ. పరిధిలో 232 ప్రాథమిక పాఠశాలలు నిర్వహిస్తున్నారు. గణాంకాల ప్రకారం 3, 4, 5 తరగతులను తరలిస్తే విద్యార్థులు బడులకు దూరమయ్యే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Elementary school mapping completed"

Post a Comment