Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Income Tax eFiling

 Income Tax eFiling ఇన్-కం-టాక్స్ రిటర్న్ ఈ-ఫైలింగ్

Income Tax eFiling

ఇన్ కం టాక్స్ చెల్లింపుదారులు తమ డ్రాయింగ్ అధికారులుకు ఫారం 16 సమర్పించిన   అనంతరం  ఇన్ కం టాక్స్ రిటర్న్  ఈ-ఫైలింగ్ వ్యక్తి గతంగా చేయాలి.పన్ను వర్తించే ఆదాయం రూ.2,60,000/-లు కన్నా ఎక్కువగా వున్నవారు జులై 31లోగా ఆదాయపు పన్ను రిటర్న్దాఖలు చేయవలసి వుంటుంది.  ఇందుకు ఫిబ్రవరి లో డి డి ఓ లకుసమర్పించిన ఫారం 16 ఆధారంగా రిటర్న్ దాఖలు చేయాలి. 

దాఖలు చేయవలసిన విధానం:

వేతనం లేదా పెన్షన్ ద్వారా ఆదాయంపొందుచున్నవారు, పెట్టుబడులపై వడ్డీ ఆదాయం పొందేవారు,ఒకే గృహం ద్వారా ఆదాయం వున్నవారు ఐటిఆర్-1 (సహజ్)ఫారం ద్వారా రిటర్న్ దాఖలు చేయాలి. ఇందుకు ఆన్లైన్ లొనే 'ఈ-రిటర్న్"ను సులభంగా దాఖలు చేసుకోవచ్చు.

పేరు రిజిస్టర్  చేసుకొనుట మరియు లాగిన్ అగుట

 మొదటగా incometaxindiaefiling.gov.in వెబ్ సైట్లోకి ప్రవేశించి'register your self అను ఆప్షన్ ఎంచుకొనవలెను. దానిలో పాస్వర్డ్ తదితర వివరములను పూర్తి చేసిన తదుపరి మెయిలకు వచ్చిన లింక్ కాపీ చేసి బ్రౌజర్లో పేస్ట్ చేసిన తర్వాత మొబైల్ కి వచ్చిన పిన్ నెంబర్ని నమోదు చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లే. మీ పాస్ వర్డ్ ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంతకు ముందే రిజిస్టర్ అయి ఉంటే మీ యూసర్ ఐ డి పాస్స్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ ఆవవచ్చు.

ఫారం 26 AS :

ఈ-ఫైలింగ్ చేసేందుకు ఫారం 26 ASను పరిశీలించుకోవాలి. పైన తెలిపిన వెబ్ సైట్ లోకి ప్రవేశించిన తదుపరి  view form 26 AS ని ఎంచుకోవాలి. దానిలో యూజర్ ఐ డి అంటే పాన్ నెంబరు, రిజిస్ట్రేషన్లో మనం ఎంచుకున్న పాస్వర్డ్ తదితర అంశాలను నమోదు చేసిన తదుపరి ఫారం 26 ASను క్లిక్ చేసి ఎసెన్మెంట్ సంవత్సరం సెలక్ట్  చేరుకుంటే ఫారం 26 AS ఓపెన్ అవుతుంది. దానిలో ఆ సంవత్సరం మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు అయినదీ లేనిదీ పరిశీలించుకోవచ్చు. ఫారంలో పన్నునమోదు సక్రమంగా ఉన్నప్పుడే ఇ-రిటర్న్ చేయాలి.

ఫారం 26 ASలో నమోదుల పరిశీలన :

ఫారం 26 ASలో మనం పరిశీలిన చేసినప్పుడు మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు కానట్లయితే డిడిఓకుతెలియ జేయాలి.సక్రమంగా నమోదు కాకపోవడానికి కారణాలు 1) డిడిఓ త్రైమాసిక రిటర్న్ ( Q1, Q2, Q3, Q4 ) లను సమర్పించకపోవడం లేదా సమర్పించిన వానిలో   పొరపాటు జరగడం అయి వుండవచ్చు.  త్రైమాసిక రిటర్న్  దాఖలు చేయవలసిన బాధ్యత డిడిఓలదే కాబట్టి, వారే దాఖలు చేయడం లేదా తప్పులను సవరించడం చేయవలసి వుంటుంది.

ఇ-ఫైలింగ్ చేయడం:

ఫారం 26 ASలో పన్ను నమోదు సక్రమంగా ఉన్నట్లు సంతృప్తి చెందిన తర్వాత ఈ-ఫైలింగ్ చేయడం ప్రారంభించాలి. incometaxindiaefiling.gov.inవెబ్ సైట్ లోకి ప్రవేశించిన తర్వాత 'Quick e file ITR-I & ITR-4S' ఎంపిక చేసుకోవాలి.పాన్ నెంబర్, పాస్వర్డ్, పుట్టిన తేది తదితర వివరాలనునమోదు చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే ఆధార్నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం పాన్ నెంబరు, ITR పేరు (ITR-I)అసెస్మెంట్ సంవత్సరం సెలక్ట్ చేసుకోవాలి. తరువాతఇవ్వబడిన మూడు ఆప్షన్లు 1) పాన్ ఆధారంగా 2) గతంలోదాఖలు చేసిన రిటర్న్ ఆధారంగా 3) నూతన చిరునామాలతోఒకటి ఎంపిక చేసుకొని లాగిన్ అవ్వాలి. యుటిఎఫ్. తదుపరి వచ్చే ఫారంలో వ్యక్తిగత వివరాలు, ఆదాయం వివరాలు, పన్ను వివరాలు, పన్ను చెల్లింపు వివరాలు,80జి వివరాలు నమోదు చేయాలి. నమోదులను ఎప్పటికప్పుడుసేవ్ చేసుకొంటే మంచిది. అన్ని నమోదులు పూర్తి అయిన తర్వాత సబ్మిట్ చేయాలి. 26 ASలో నమోదైన పన్నుఇ-ఫైలింగ్ పన్ను ఒకే విధంగా వుండాలి. లేనట్లయితేనోటీసులు వచ్చే అవకాశం వుంటుంది.

ఎకనాలెడ్జ్మెంట్:

ITR-1 సబ్మిట్ చేసిన తరువాత ఎకనాలెడ్జ్ మెంట్ ఆప్షన్స్,

వస్తాయి. దానిలో 'NO CVC' అనే ఆప్షన్ ఎంపిక చేసుకొని తదుపరి వచ్చిన ఆప్షన్స్ లో ' Mobile OTP ఆప్షన్ ఎంపిక చేసుకొంటే మన ఫోనికి, మెయిల్ కి OTP వస్తుంది. ఆ పాస్వర్డ్ నమోదు చేస్తే ఎకనాలెడ్జ్మెంట్ మన మెయిల్ కి వస్తుంది. దాని నుండి ఎకనాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Income Tax eFiling"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0