Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Is the Aadhaar number correct? Procedure for verification.

 Aadhaar Number: ఆధార్ నెంబర్ సరైనదేనా? వెరిఫై చేసుకొనే విధానం.

Is the Aadhaar number correct?  Procedure for verification.

ఆధార్ నెంబర్‌లో 12 అంకెలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే 12 అంకెలు ఉన్నంతమాత్రాన అది ఆధార్ నెంబర్ కాదంటోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. ఉదాహరణకు ఎవరిదైనా ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ నెంబర్ తీసుకున్నట్టైతే ఆ ఆధార్ నెంబర్‌ను వెరిఫై చేయాలని UIDAI కోరుతోంది. 12 అంకెలు ఉన్నంత మాత్రానా అది ఆధార్ నెంబర్ కాదని, ఈ తరహా ఆధార్ మోసాలు జరుగుతున్నాయని UIDAI అప్రమత్తం చేస్తోంది. ఎవరైనా ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ నెంబర్ ఇస్తే ఆ నెంబర్‌ను వెరిఫై చేయాలని కోరుతోంది. https://uidai.gov.in/ లేదా https://resident.uidai.gov.in/ వెబ్‌సైట్లలో ఆధార్ నెంబర్ వెరిఫై చేయొచ్చు. మరి ఆధార్ నెంబర్‌ను ఎలా వెరిఫై చేయాలో తెలుసుకుందాం.

Verify Aadhaar Number: ఆన్‌లైన్‌లో ఆధార్ నెంబర్ వెరిఫై చేసుకొనే విధానం

  • ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో My Aadhaar సెక్షన్‌లో Aadhaar services లిస్ట్‌లో Verify an Aadhaar Number పైన క్లిక్ చేయాలి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • పైన చెప్పిన స్టెప్స్ కాకుండా నేరుగా https://resident.uidai.gov.in/ లింక్ ఓపెన్ చేసినా ఆధార్ వెరిఫికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది.
  • అందులో 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి Proceed to Verify పైన క్లిక్ చేయాలి.
  • ఆ ఆధార్ నెంబర్ యాక్టీవ్‌లో ఉందా? లేదా డీయాక్టివేట్ చేశారా? అసలు అది ఆధార్ నెంబరేనా? అన్న విషయం తెలుస్తుంది.
  • గ్రీన్ టిక్‌తో Aadhaar Number xxxxxxxxxxxx Exists అని కనిపిస్తే ఆధార్ నెంబర్ యాక్టీవ్‌లో ఉన్నట్టే.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Is the Aadhaar number correct? Procedure for verification."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0