Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

LPG Price Today: Another shock to the common man ... a huge increase in the price of a gas cylinder.

 LPG Price Today: సామాన్యులకు మరో షాక్... భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.

LPG Price Today: Another shock to the common man ... a huge increase in the price of a gas cylinder.

LPG Cylinder Price Today సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఓవైపు పెట్రోల్ ధరలు పెరుగుతుంటే మరోవైపు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఎంత పెరిగిందో తెలుసుకుందాం.

  • 1. గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటితే, గ్యాస్ సిలిండర్ ధర రూ.1,000 వైపు పరుగులు తీస్తోంది. ఈసారి గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.25.50 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధ రూ.887 కి చేరుకుంది.
  • 2. ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయన్న సంగతి తెలిసిందే. ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధర పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ ధరలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. 
  • 3. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గడంకన్నా పెరగడమే ఎక్కువ. ఈసారి గ్యాస్ సిలిండర్ ధర రూ.25.50 పెరిగి సామాన్యులకు షాక్ ఇచ్చింది. 
  • 4. ఎల్‌పీజీ ధర రూ.25.50 పెరగడంతో ఢిల్లీలో ధర రూ.834.50 కి చేరుకుంది. ఇక కోల్‌కతాలో రూ.861, ముంబైలో రూ.834.5, చెన్నైలో రూ.850 ధరకు చేరుకుంది. 
  • 5. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.25.50 పెరగగా, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.84 పెరిగింది.
  • 6. ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1753 కాగా, ఢిల్లీలో రూ.1550. ఇక కోల్‌కతాలో రూ.1651.5 కాగా, ముంబైలో రూ.1507, చెన్నైలో రూ.1687.5.
  • 7. గత నెలలో ఎల్‌పీజీ డొమెస్టిక్ సిలిండర్ ధరల్ని పెంచలేదు ఆయిల్ కంపెనీలు. కమర్షియల్ సిలిండర్ ధర రూ.123 పెరిగింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "LPG Price Today: Another shock to the common man ... a huge increase in the price of a gas cylinder."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0