Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ONGC Foundation 2000 Scholarships

 ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్‌.. ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంబీబీఎస్‌ చదివే విద్యార్థులు అప్లయ్‌ చేసుకోగలరు.

ONGC Foundation 2000 Scholarships

ONGC Foundation 2000 Scholarships: ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.48,000 వేల రూపాయలు అందజేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

ప్రధానాంశాలు:

  • ఓఎన్‌జీసీ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌లు
  • ప్రతిభావంతులైన 2వేల మందికి అందజేత
  • ఏడాదికి రూ.48 వేల స్కాలర్‌షిప్‌
  • ఆగస్టు 6 దరఖాస్తులకు చివరితేది

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) ఫౌండేషన్‌.. 2020–2021 విద్యాసంవత్సరానికి గాను ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్‌ల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.48,000 వేల రూపాయలు అందజేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు డైరెక్ట్‌ లింక్‌ ఇదే

 ఇక్కడ క్లిక్‌ చేయండి

మొత్తం స్కాలర్‌షిప్‌లు: 2000

  • ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్‌ల సంఖ్య – 1000
  • ఓబీసీ విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్‌ల సంఖ్య – 500
  • జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్‌ల సంఖ్య – 500

ముఖ్య సమాచారం:

స్కాలర్‌షిప్‌ మొత్తం: ఏడాదికి రూ.48,000 అందజేస్తారు.

అర్హత: ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, మాస్టర్‌ డిగ్రీ కోర్సులు (ఎంబీఏ), జియాలజీ, జియోఫిజిక్స్‌ చదివే ప్రతిభావంతులైన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. 2020–21 విద్యాసంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌కు అర్హులు.

మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్యలో 50 శాతం స్కాలర్‌షిప్‌లను బాలికలకు కేటాయిస్తారు.

ఎంపిక విధానం: సంబంధిత కోర్సుకు నిర్దేశించిన అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తులకు చివరి తేది:  06.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ongcscholar.org/  లేదా https://ongcindia.com/


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ONGC Foundation 2000 Scholarships"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0