Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Online education is not a substitute

ఆన్లైన్ విద్యాబోధన ప్రత్యామ్నాయం కాదు

Online education is not a substitute

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

తరగతి గదుల్లో బోధించే విద్యకు ఆన్లైన్ విద్యాబోధన సరైన ప్రత్యామ్నాయం కాదని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఆన్లైన్, ఆఫ్లైన్ విద్యావిధానాన్ని మిశ్రమం చేస్తూ కొత్త విద్యావిధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయం (పానిపట్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ప్రపంచ విశ్వవిద్యాలయాల సదస్సు'ను ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యాబోధన అనేది విద్యార్థులకు విషయాన్ని చేరవేయడంగానే కాకుండా, వారిలో సృజనాత్మకత, పరిశోధనాత్మకతను పెంపొందించేదిగా ఉండాలని సూచించారు. విద్యను అందించడం మాత్రమే కాకుండా, వివిధ రంగాల్లో నాయకులుగా ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ధీరేంద్రపాల్ సింగ్, ఓపీ జిందాల్ వర్సిటీ వ్యవస్థాపక చైర్మన్ నవీన్ జిందాల్, విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజ్కుమార్ సహా 25 దేశాలలోని 150 మందికి పైగా మేధావులు, ఉపకులపతులు వీడియో కాన్ఫరెన్స్ వేదిక ద్వారా ఈ సదస్సులో పాల్గొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Online education is not a substitute"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0