Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

This paves the way for education abroad.

విదేశాలలో విద్య కు మార్గం ఇలా సుగమం.

This paves the way for education abroad.

విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే విద్యార్థులకు ‘ఏవిధంగా ప్రిపేర్‌ కావాలి? సీటు ఎలా సంపాదించుకోవాలి? ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి? వీసా ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలి?’ అనే సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే పక్కా ప్లానింగ్‌ ఉండాలి.

యూనివర్సిటీ ఎంపిక

విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లేవారిలో ఎక్కువగా ఇంజినీరింగ్‌, తరువాత కామర్స్‌ (బీబీఏ, ఎంబీఏ), ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఉన్నారు. మెరిట్‌ ఉన్నవారు విదేశాల్లో మాస్టర్‌ డిగ్రీ చేయడానికి స్వయంగా కృషిచేస్తున్నారు. చాలామంది అవగాహన లేక కన్సల్టెన్సీలను ఆశ్రయించి డబ్బులు వృథా చేసుకొంటున్నారు. అంతేకాకుండా కన్సల్టెన్సీల వల్ల చాలామంది మంచి యూనివర్సిటీలకు బదులు మామూలు యూనివర్సిటీల్లో చదువుకోవాల్సి వస్తుంది. కొన్ని మామూలు యూనివర్సిటీలు కమీషన్లు ఇస్తామని కన్సల్టెన్సీలకు ఆఫర్లు ఇస్తాయి. దీంతో చాలామంది నష్టపోతున్నారు. ఆయా కన్సల్టెన్సీలు మొత్తం ఐదు యూనివర్సిటీల్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తాయి. ఆ తరువాత ఎక్కువ యూనివర్సిటీలకు దరఖాస్తు చేయాలని కోరితే అదనంగా ఫీజులు వసూలు చేస్తాయి. కన్సల్టెన్సీలు విద్యార్థులకు ఇచ్చిన ప్యాకేజీలో ఒకటి రెండు యూనివర్సిటీలు తమకు నచ్చినవాటికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తాయి. మిగిలిన యూనివర్సిటీల దరఖాస్తులు కన్సల్టెన్సీ తన చాయిస్‌ తీసుకొని దరఖాస్తు చేస్తుంది. దీంతో కన్సల్టెన్సీలు దరఖాస్తు చేసే యూనివర్సిటీల గురించి తెలుసుకోలేకపోతాం. పైగా ఎస్‌ఓపీ, దరఖాస్తు అంతా కన్సల్టెన్సీలే చేస్తాయి. దీనివల్ల విద్యార్థి ప్రతిభ యూనివర్సిటీకి అర్థం కాకపోవడంతో మంచి యూనివర్సిటీలో సీటు కోల్పోయే అవకాశం ఉంటుంది.

ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఇంజినీరింగ్‌, కామర్స్‌, సైన్స్‌ విద్యార్థులు ఎవరైనా ఉన్నతవిద్య కోసం డిగ్రీ కాగానే గ్యాప్‌ లేకుండా విదేశాలకు వెళ్లాలనుకుంటే ఏడాది ముందునుంచే ప్రిపరేషన్‌ చేసుకోవాలి. డిగ్రీలో గ్రేడ్‌ పాయింట్‌ 8.5కు పైగా వచ్చేలా చూసుకోవాలి. అలాగే మంచి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలి, వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్‌ చేయాలి. డిగ్రీలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకొని ఎలా అభివృద్ధి అవుతున్నాడనేది (ప్రోగ్రెస్‌) పరిశీలిస్తారు. మనం దానిని ఆయా యూనివర్సిటీలకు తెలియజేయాలి.

కోర్సు ఎంపిక

ఏ కోర్సు చదవాలనుకుంటున్నామో.. ముందుగానే నిర్ణయించుకోవాలి. ఆ కోర్సు వెళ్లాలనుకున్న దేశంలో ఏ యూనివర్సిటీలో ఉందో తెలుసుకోవాలి. ఆయా యూనివర్సిటీల్లో ఎంపిక చేసుకున్న కోర్సు సబెక్టులు ఏంటి? ఆ కోర్సు అనుగుణంగా ఉందా లేదా అని పరిశీలించాలి? ఆయా యూనివర్సిటీల్లో చదువుతున్న, చదివి ఉద్యోగాలు చేస్తున్న సీనియర్లను అడిగి తెలుసుకోవాలి. ఆ తరువాత ఏ యూనివర్సిటీలకు వెళితే బాగుంటుందో నిర్ధారించుకోవాలి.

రాయాల్సిన పరీక్షలు

ఏ దేశంలో ఉన్నతవిద్య చదవాలన్నా టోఫెల్‌ (TOFEL), ఐఈఎల్‌టీఎస్‌ (IELTS) పరీక్షలు రాయాలి. అమెరికా, యూరోపియన్‌ యూనివర్సిటీలు జీఆర్‌ఈ (GRE) పరీక్ష అడుగుతాయి. బిజినెస్‌, కామర్స్‌ విద్యార్థులకు జీమ్యాట్‌ (GMAT) అడుగుతాయి. ఈ పరీక్షలకు కన్సల్టెన్సీలు ఇచ్చే కోచింగ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే చదువుకోవచ్చు. జీఆర్‌ఈ ప్రిపరేషన్‌కు మూడు నెలల సమయం ఉంటుంది. టోఫెల్‌కు 10 రోజుల సమయం సరిపోతుంది. మంచి యూనివర్సిటీల్లో సీటు రావాలంటే జీఆర్‌ఈ 340 మార్కులకు 325 పైనే రావాలి.

రికమండేషన్‌

ముందుగా మనకు చదువు చెప్పిన ప్రొఫెసర్లు, ఉద్యోగం చేసిన పరిశ్రమల్లోని మేనేజర్‌ లేదా హెడ్‌, ఎవరి దగ్గర రిసెర్చ్‌ చేశామో ఆ హెడ్‌లతో విదేశాల్లో తాను మాస్టర్‌ డిగ్రీ చదువుకోవాలనుకుంటున్న విషయాన్ని చర్చించాలి. వాళ్లకు చదవాలనుకుంటున్న కోర్సు గురించి వివరించాలి. వాళ్లతో మంచి రిలేషన్‌షిప్‌ ఏర్పాటు చేసుకోవాలి. ప్రొఫెసర్లు, పరిశ్రమల మేనేజర్లు వాళ్ల రికమండేషన్స్‌ మనకు ఇవ్వరు. అప్లికేషన్‌ పోర్టల్‌ నుంచి మనం రికమండేషన్స్‌ ఇచ్చే డిటెయిల్స్‌ ఇస్తే అప్లికేషన్‌ నుంచి నేరుగా వాళ్లకు వెళతాయి. వాళ్లకు వెళ్లిన వెంటనే వాటిని నేరుగా ఆయా యూనివర్సిటీలకు పంపిస్తారు.

సీవీ, ఎస్‌ఓపీ

మన పనితీరు గురించి సీవీ ద్వారా తెలియజేయాలి. ఏ కోర్సు చేశాం, ఏ కోర్సు చేయాలనుకుంటున్నాం, దానిలో ఎలా సక్సెస్‌ అవుతాయో చెప్పాలి. ఎస్‌వోపీ (స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌)ని ఒకటి నుంచి ఒకటిన్నర పేజీకి మించకుండా సింపుల్‌ లాంగ్వేజీతో రాయాలి. మనం ఏం చేశాం, ఎంచుకున్న కోర్సుకు ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఇప్పటి వరకు ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ యూనివర్సిటీకి ఎలా ఉపయోగపడుతుందో తెలపాలి. దీనిని తయారు చేయడానికి కనీసం ముగ్గురు సీనియర్ల, ప్రొఫెసర్ల సహాయం తీసుకోవాలి. కొన్ని యూనివర్సిటీలు అప్పుడప్పుడు మూడు ప్రశ్నలు ఇచ్చి వ్యాసాలు (ఎస్సేస్‌) రాయమని అడుగుతాయి. అప్లికేషన్‌ చివరితేదీ వరకు ఆగకుండా నెల రోజుల ముందుగానే సబ్‌మిట్‌ చేయాలి. జర్మనీ యూనివర్సిటీల్లో గ్రేడ్‌ పాయింట్‌ కూడా అడుగుతారు.

దరఖాస్తు ఎలా చేయాలి

దరఖాస్తు చేయడానికి మందుగా యూనివర్సిటీలు, కోర్సుల గురించి, మనం చదవాలనుకునే కోర్సు ఏయే యూనివర్సిటీల్లో ఉందో తెలుసుకోవాలి. ప్రతి విద్యార్ధి 4 యాంబిషియస్‌, 3 మోడరేట్‌, 3 సేఫ్‌ సైడ్‌ యూనివర్సిటీలకు అప్లయ్‌ చేసుకోవాలి. ఆయా యూనివర్సిటీలు ఫీజు ఎంత నిర్ణయించాయి, ఆ మొత్తం అందుబాటులో ఉంటుందా లేదా? అని నిర్ధారించుకొని దరఖాస్తు చేయాలి.

ఐ-20 వచ్చాక..

ఎంబసీ కార్యాలయాలు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థి ఆర్థిక వనరులు, స్థిర, చర ఆస్తులను పరిశీలిస్తాయి. విద్యార్థికి అయ్యే ఖర్చును ఆ కుటుంబం భరించగలదా లేదా అని ఎంబసీ నిర్ధారించుకుంటుంది. చదువు పూర్తయిన తరువాత తిరిగి భారత్‌కు వచ్చి స్థిరపడతాడా లేక అక్కడే ఉండాలన్న ఆలోచన ఉందా అనేది కూడా పరిశీలిస్తుంది. చదువు పూర్తయిన తరువాత స్వదేశానికి వచ్చి స్థిరపడతాడనుకుంటేనే ఎంబసీలు వీసా ఇస్తాయి. ఇందుకోసం ఐ-20 వచ్చిన తరువాత యూనివర్సిటీకి చెల్లించే ఫీజు, నివాసానికి అయ్యే ఖర్చులను నగదు రూపంలో బ్యాంకు స్టేట్‌మెంట్‌ ద్వారా చూపించాలి. స్థిర, చర ఆస్తులు ఎంత ఉన్నాయో ఆడిటర్‌ సర్టిఫికెట్‌ను జతచేయాలి.

బిజినెస్‌, కామర్స్‌ కోర్సులు

ఎంబీఏ లాంటి కోర్సులు చదవాలనుకునేవారు జీమ్యాట్‌ పరీక్ష రాయాలి. డిగ్రీ తరువాత 3 నుంచి 5 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉండాలి. పనిలో ఎలాంటి గ్రోత్‌ ఉంది, కంపెనీకి ఏవిధంగా ఉపయోగపడ్డావో ఎస్‌ఓపీలో రాయాలి. మంచి రికమండేషన్స్‌ ఉండాలి. ఇంటర్వ్యూలు ఉంటాయి. రెన్యువబుల్‌ ఎనర్జీకి వెళ్లాలంటే యూరప్‌లో ఎక్కువ అవకాశాలున్నాయి. డ్యూయల్‌ యూనివర్సిటీలో చదువుకోవడానికి ఒకే అడ్మిషన్‌ ద్వారా అవకాశం వస్తుంది. ఒక సెమ్‌ ఒక యూనివర్సిటీలో, మరో సెమ్‌ మరో యూనివర్సిటీలో చదువుకోవచ్చు.

బ్యాంకు రుణాలు

ఐ-20 వచ్చిన తరువాత ఆయా బ్యాంకులు విద్యారుణాలు ఇస్తాయి. బ్యాచిలర్‌ డిగ్రీ సర్టిఫికెట్లతో పాటు ఐ-20, అడ్మిషన్‌ ఇచ్చిన కాలేజీ ఫీజు స్ట్రక్చర్‌, అక్కడ ఉండటానికి అయ్యే ఖర్చుల (యూనివర్సిటీల వెబ్‌ సైట్‌లో ఉంటాయి) వివరాలను బ్యాంకుకు అందించాలి. ప్రొడిజి (prodigy) అనే ఫైనాన్స్‌ సంస్థ మంచి యూనివర్సిటీలో సీటు వచ్చినవారికి ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండానే విద్యారుణం అందిస్తుంది. 100 డాలర్ల ఫీజుకు 80 డాలర్లు రుణం ఇస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.40 లక్షల వరకు తనఖా లేకుండా రుణం ఇస్తుంది. జాతీయ బ్యాంకులన్నీ ఆస్తులను తనఖా పెట్టుకొని రుణం ఇస్తున్నాయి.

వీసా ఇంటర్వ్యూ..

వీసా ఇంటర్వ్యూకు ఎంబసీ కార్యాలయానికి వెళ్లాలి. ఇందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో దేశానికి ఆయా ఎంబసీల్లో ఇంటర్వ్యూలకు ఆయా వెబ్‌సైట్లలో అప్లయ్‌ చేసుకోవాలి. ఇంటర్వ్యూలో ఏ కోర్సు చదవడానికి, ఏ యూనివర్సిటీకి వెళుతున్నామనేది పరిశీలిస్తారు. వీసా తిరస్కరణకు గురైతే ఎంత మంచి యూనివర్సిటీలో సీటు వచ్చినా వెళ్లలేరు. ఇందుకు రెండు మూడు అప్లికేషన్స్‌ నింపాలి. అన్నీ ఒకేతీరుగా ఉండాలి. వాటిల్లో తేడా వస్తే రిజెక్ట్‌ చేస్తారు.

యూఎస్‌ ఎంబసీ

విదేశీ విద్య చదవాలనుకునేవారికి మన దగ్గర ఉన్న విదేశీ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయాలు సహకరిస్తున్నాయి. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికన్‌ కాన్సులేట్‌ ప్రతి ఏటా ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నది. అమెరికన్‌ కార్నర్‌ పేరిట పలు కాలేజీల్లో సెంటర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తుంది. ఎలాంటి సందేహాలున్నా, సమస్యలున్నా వాటిని పరిష్కరించేందుకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

స్కాలర్‌ షిప్స్‌

ఆర్థికంగా బాగా లేని విద్యార్థులకు, రుణాలు, లోన్ల కోసం తిప్పలుపడేవారికి ఉచితంగా చదువుకునే అవకాశాన్ని పలు యూనివర్సిటీలు కల్పిస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు ట్యూషన్‌ ఫీజుల వరకు భరిస్తుండగా, మరికొన్ని దేశాల్లో తిండి, నివాస ఖర్చులను యూనివర్సిటీలే రీయింబర్స్‌ చేస్తున్నాయి.

స్కాలర్‌షిప్స్‌ రకాలు

  • మెరిట్‌ బేస్డ్‌ స్కాలర్‌షిప్స్‌
  • (ప్రతిభ ఆధారంగా)
  • నీడ్‌ బేస్డ్‌ స్కాలర్‌షిప్స్‌
  • (అవసరాలు, రిసెర్చ్‌, పేదరికాన్ని బట్టి)
  • ఫుల్లీ ఫండెడ్‌ స్కాలర్‌షిప్స్‌ (వందకు వందశాతం ఫీజులు, తిండి, నివాస ఖర్చులు)
  • గవర్నమెంట్‌ స్కాలర్‌షిప్స్‌ (ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్స్‌)
  • స్పెషలైజ్డ్‌ స్కాలర్‌షిప్స్‌ (మ్యూజిక్‌, అడ్వెంచర్‌ల కోసం)
  • స్కాలర్‌షిప్స్‌కు వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి.
  • చాలా దేశాలు జూలైలోనే స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి.
  • 6 నుంచి 8 యూనివర్సిటీల్లో స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

స్కాలర్‌షిప్స్‌ అందజేసే యూనివర్సిటీలు

  • జర్మనీ: లుడ్విక్‌ మాక్స్‌మిలన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మ్యూనిచ్‌, ఫ్రీ యూనివర్సిటీ బెర్లిన్‌, టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మ్యూనిచ్‌, హిడెల్‌బర్గ్‌ యూనివర్సిటీ
  • కెనడా: కార్నెల్‌ యూనివర్సిటీ, కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ యూనివర్సిటీ, హంబర్‌ కాలేజ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కాల్గరి
  • లండన్‌: యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్‌ మినిస్టర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్‌ లండన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ది వెస్ట్‌ ఆఫ్‌ లండన్‌, సీఫెల్డ్‌ హల్లమ్‌ యూనివర్సిటీ
  • ఇటలీ: బకోని యూనివర్సిటీ, హిడెల్‌బర్గ్‌ యూనివర్సిటీ, స్కోలా నార్మలే సుపీరియర్‌ యూనివర్సిటీ
  • జర్మనీలో ఉచిత విద్య

–శ్రీనివాస్‌గౌడ్‌, ఓరియంట్‌ స్పెక్ట్రా కన్సల్టెన్సీ

జర్మనీలో ఉచితంగా

విద్యనందిస్తున్నారు. రూపాయి ఫీజు తీసుకోకుండా అక్కడ స్వదేశీ, విదేశీ విద్యార్థులన్న తేడా లేకుండా విద్యనందిస్తున్నారు. జర్మనీతో పాటు చాలా దేశాలు ప్రతిభ ఆధారంగానే స్కాలర్‌షిప్స్‌ ఇస్తున్నాయి. జర్మనీలో 75 శాతం మార్కులు పొందిన వారికి ఉచితవిద్యనందిస్తుండగా, పలు యూనివర్సిటీలు అనేక మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ను ఇస్తున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "This paves the way for education abroad."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0