Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ATM: Reserve Bank of India sensational decision .. Is there money in ATMs? If so, the respective banks will be fined.

 ATM : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం .. ఏటీఎంలలో డబ్బులు లేవా ? అలా ఐతే ఆ సంబంధిత బ్యాంకు లకు జరిమానా.

ATM: Reserve Bank of India sensational decision .. Is there money in ATMs?  If so, the respective banks will be fined.

ATM: ప్రతీ వ్యక్తి తన డబ్బులు బ్యాంకుల్లో సేవ్ చేసుకుంటారు. డబ్బు అవసరమైనప్పుడు గతంలో బ్యాంకుకు వెళ్లి విత్ డ్రా చేసుకునేవారు. కానీ, ఆ తరువాత వచ్చిన ఏటీఎం కార్డుతో బ్యాంకుల్లో గంటలు గంటలు క్యూ కట్టాల్సిన పని తప్పింది. ఏటీఎం సెంటర్ల వద్దకు వెళితే నిమిషాల్లో పని పూర్తవుతుంది. ఏటీఎం మిషిన్‌లో కార్డు పెట్టి.. మనకు అవసరమైన మొత్తంలో నగదు విత్ డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అయితే, ఒక్కోసారి ఏటీఎం సేవలు కూడా వినియోగదారులను చిరాకు పెట్టిస్తున్నాయి. ఏటీఎంకు ఎన్నిసార్లు వెళ్లినా.. 'నో మనీ' అని చూపిస్తుంటుంది. దాంతో విసిగిపోయి.. మళ్లీ బ్యాంకుకు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

అయితే, ఈ పరిస్థితికి చెక్ పెడుతూ మంగళవారం నాడు రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏటీఎం సెంటర్‌లో డబ్బులు లేకపోవడంతో కస్టమర్ తప్పు కాదని, బ్యాంకర్ల తప్పు అని అభిప్రాయపడింది. అందుకే.. కస్టమర్లకు ఇబ్బంది కలుగకుండా.. రిజర్వ్ బ్యాంకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. ఏటీఎంలలో డబ్బులు లేనట్లయితే.. సంబంధిత బ్యాంకుకు జరిమానా విధించబడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన వర్తిస్తుంది..
ఈ నిబంధన అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఏటీఎంలలో డబ్బు అందుబాటులో లేదనే ఫిర్యాదులు చాలా వచ్చాయని, వీటిని పరిశీలించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై జరిపిన సమీక్షలో భాగంగా.. ఏటీఎం మెషీన్లు పనిచేయకపోయినా, వాటిల్లో డబ్బులు లేకపోయినా సామాన్య ప్రజలు భారీ సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని ఆర్బీఐ అభిప్రాయపడింది. అందువల్ల బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం కార్యకలాపాలు తమ సిస్టమ్‌లను సరిగా ఏర్పాటు చేసుకోవాలని, ఏటీఎం లలో నగదు లభ్యతను పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా ఏటీఎంలలో డబ్బు కొరత రాకుండా చూడొచ్చని పేర్కొంది. అయితే, ఈ నియమాన్ని పాటించడంలో అలసత్వం ప్రదర్శిస్తే తీవ్రంగా పరిగణించబడుతుందని, జరిమానలు విధించడం జరుగుతుందని బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టం చేసింది.

జరిమానా ఎంత ఉంటుంది?
ఆర్బీఐ ప్రకారం.. ఒక నెలలో 10 గంటలకు మించి ఏటీఎంలలో నగదు లేకపోతే రూ. 10,000 వరకు జరిమానా విధించబడుతుంది. వైట్ లేబుల్ ఏటీఎంల విషయంలో, బ్యాంకులపై జరిమానా విధించబడుతుంది. కొన్ని బ్యాంకులు ఏటీఎంలలో నగదు పెట్టడానికి ఇతర కంపెనీల సేవలను తీసుకుంటాయి. వారి విషయంలోనూ బ్యాంక్ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిగా ఆ వైట్ లేబుల్ ఏటీఎం కంపెనీ నుండి బ్యాంక్ జరిమానాను భర్తీ చేయవచ్చు. కాగా, ఏటీఎంలో నగదు లేకపోతే, సిస్టమ్ జనరేట్ చేసిన స్టేట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఈ ప్రకటన ఏటీఎం కింద వచ్చే ఆర్‌బిఐ ఇష్యూ విభాగానికి పంపబడుతుంది.

100 రూపాయల ఫైన్
ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేయలేదు. కానీ ఖాతా నుంచి మాత్రం డబ్బులు కట్ అయ్యాయి. దీనికి సంబంధించి కూడా ఆర్బీఐకి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపైనా ఆర్బీఐ ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. ఇలాంటి పొరపాట్లు జరిగే ఏటీఎం కు సంబంధించి బ్యాంకు తరఫను నష్టపరిహారం చెల్లించడానికి ఒక నిబంధన ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు దీనికి సంబంధించి ప్రత్యేక నియమాన్ని రూపొందించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సంబంధించి లావాదేవీల్లో ఇలాంటి పొరపాట్లే జరిగినట్లయితే.. వెంటనే మీ అకౌంట్‌లో డబ్బు జమ చేయబడుతుంది. దీని కోసం కస్టమర్ ఎలాంటి ఫిర్యాదు చేయనవసరం లేదు. ఒకవేళ అలా జరగకపోతే.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఫిర్యాదును 7 రోజుల్లోగా పరిష్కరించాలి. అలా 7 రోజుల్లోగా పరిస్కారం కాకపోతే.. సదరు కస్టమర్‌కు ప్రతీ రోజూ రూ. 100 పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ATM: Reserve Bank of India sensational decision .. Is there money in ATMs? If so, the respective banks will be fined."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0