Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Beginning of the 2021-22 Academic Year - School Management Guidelines

2021-22 విద్యా సంవత్సరం ప్రారంభం - పాఠశాల నిర్వహణ మార్గదర్శకాలు

Beginning of the 2021-22 Academic Year - School Management Guidelines

Covid 19 మహమ్మారి కారణంగా మూతపడినటువంటి పాఠశాలలు 2021-22 విద్యా సంవత్సరానికి గాను 16-08-21 నుండి పునః ప్రారంభించవలెను.

పాఠశాలలు పునః ప్రారంభించే క్రమంలో అనుసరించవలసిన మార్గదర్శకాలు

  •  గ్రామ సచివాలయం యూనిట్ గా 10 శాతం కన్నా తక్కువ పాజిటివిటి ఉన్న ప్రాంతాలలో మాత్రమే పాఠశాలలు పునః ప్రారంభించ వలెను
  • 10 శాతం కన్నా తక్కువ పాజిటివిటి ఉన్న  ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలో 16-8-21 నుండి ప్రారంభించవలెను
  • పాఠశాలలు పునః ప్రారంభించే క్రమంలో తరగతికి 20 మంది కన్నా ఎక్కువ మంది విద్యార్థులు లేకుండా  ఉండేట్లుగా ప్రణాళికను తయారు చేసుకోన వలెను
  • ఒకవేళ తరగతి / సెక్షన్ కు 20 మంది కన్నా ఎక్కువ లేకుండా ఉండే విధంగా పాఠశాలలో ని అందరు విద్యార్థులకు  సదుపాయం ఉన్నట్లయితే పాఠశాల లోని అందరు విద్యార్థులను పాఠశాలకు అనుమతించ వలెను.
  • అలా కాని పక్షంలో తరగతి/ సెక్షన్ కు 20 మంది విద్యార్థులు ఉండేవిధంగా ప్రణాళిక తయారు చేసుకొని, విద్యార్థులను బ్యాచ్ ల వారీగా అనుమతించ వలెను.
  • పాఠశాలలోని మరుగుదొడ్లను ప్రతిరోజు 1% సోడియం హైపోక్లోరైడ్ తో  తప్పనిసరిగా శుభ్రం చేయించవలెను.
  • పాఠశాలలోని బోధన, బోధనేతర, మధ్యాహ్న భోజన సిబ్బంది మరియు విద్యార్థులు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి
  • విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించే సమయంలో వారి ఆరోగ్య పరిస్థితిని తప్పనిసరిగా గమనించవలెను
  • వీలైనంత వరకు థర్మల్ స్కానర్ ద్వారా ప్రతి విద్యార్థి యొక్క శరీర ఉష్ణోగ్రతను పరిశీలించ వలెను ఏవైనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వారిని సమీపంలోని ఆరోగ్యకేంద్రం కు పంపి తగిన  టెస్టులు చేయించవలెను.
  • తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు పాఠశాల అసెంబ్లీ కార్యక్రమాలు, గ్రూప్ లో చేసే పనులు, సామూహిక ఆటలు... ఎట్టి పరిస్థితులలోనూ నిర్వహించరాదు.
  • విద్యార్థులకు హ్యాండ్ శానిటైజర్ ను అందుబాటులో ఉంచవలెను.
  • మధ్యాహ్న భోజనం ముందు.. తర్వాత తప్పనిసరిగా చేతులను (ఆరు దశల్లో )శుభ్రపరుచుకునే విధంగా చూడాలి.
  • తల్లిదండ్రుల యొక్క రాతపూర్వక అనుమతి పత్రం తో మాత్రమే విద్యార్థులను పాఠశాలకు అనుమతించ వలెను.
  • మధ్యాహ్న భోజనం ను అందరు విద్యార్థులకు ఒకే సమయంలో కాకుండా తరగతి వారీగా నిర్వహించ వలెను.
  • విద్యార్థులు ఒకరినొకరు పెన్నులు ,పెన్సిల్లు, ఇతర సామాగ్రి మార్చుకోవడం అనుమతించరాదు.
  • పాఠశాలకు విద్యార్థులను రవాణా చేసే బస్సులు / వ్యాన్ ల లో సగం కెపాసిటీ కి మ మాత్రమే అనుమతించ వలెను.
  • పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన ఇద్దరు ఉపాధ్యాయులు సభ్యులుగా కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయవలెను.
  • అదేవిధంగా మండల స్థాయిలో మండల విద్యాశాఖ అధికారి అధ్యక్షతన కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయవలెను.
  • పాఠశాలలోని  బోధన, బోధనేతర , మధ్యాహ్న భోజన  సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోనవలెను.
  • విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులకు covid19 మహమ్మారి విషయంలో తీసుకోవలసిన  జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించాలి.
  • పాఠశాలల్లో అకడమిక్ కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో భారత ప్రభుత్వం వారు నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించి వలెను.

జిల్లా విద్యాశాఖాధికారి

చిత్తూరు

DOWNLOAD COPY




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Beginning of the 2021-22 Academic Year - School Management Guidelines"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0