Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Covid - 19 symptoms

Covid - 19 symptoms : థర్డ్ వేవ్ వస్తే పిల్లల పరిస్థితి ఏంటని దిగులు పడుతున్నారా .

Covid - 19 symptoms

కరోనా వచ్చిన తర్వాత పిల్లల్లో దాదాపు ఆరు రోజులలోపే పూర్తిగా రికవరీ కనిపిస్తుంది. 

 సాధారణంగా కరోనా బారిన పడిన పెద్దవారు దీర్ఘకాలంగా దాని వల్ల వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతూ ఉంటారు. కొన్ని నెలల వరకు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, అలసటతో పాటు మరికొన్ని లక్షణాలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే పిల్లల్లో ఇలాంటి లక్షణాలు చాలా తక్కువ అని వైద్యులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని చాలా అధ్యయనాలు నిరూపించాయి. తాజాగా ఓ కొత్త పరిశోధన కూడా ఇది నిజమని నిరూపిస్తోంది.

కరోనా వచ్చిన తర్వాత పిల్లల్లో దాదాపు ఆరు రోజులలోపే పూర్తిగా రికవరీ కనిపిస్తుంది. నాలుగు వారాల తర్వాత కూడా లక్షణాలు కనిపించే పిల్లలు చాలా అరుదు. బాధితుల్లో వీరు కేవలం 4.4 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఈ విషయాన్నే యూకేకి చెందిన ఓ స్టడీ మరోసారి నిరూపించింది.
ఈ అధ్యయనాన్ని లాన్సెట్ చైల్డ్ అండ్ అడోలసెంట్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు.

లండన్‌లోని కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ ఎమ్మా డంకన్ దీనికి లీడ్ ఆథర్ గా వ్యవహరించారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ చిన్న పిల్లల్లో కరోనా లక్షణాలు దీర్ఘకాలం ఉండవు అని నిరూపించేందుకు ఇది మరో అధ్యయనం అని వెల్లడించారు. అయితే చాలా తక్కువ శాతం మంది పిల్లల్లో మాత్రం ఎక్కువ రోజుల పాటు లక్షణాలు కనిపిస్తున్నాయని.. ఈ అధ్యయనంలో భాగంగా ఆ పిల్లల గురించి, వారి కుటుంబాల గురించి తాము పూర్తిగా స్టడీ చేశామని ఆమె తెలిపారు.

ఈ అధ్యయనం కోసం ZOE COVID స్టడీ మొబైల్ యాప్ ద్వారా సేకరించిన డేటాను పరిశోధకులు ఉపయోగించారు. ఇందులో భాగంగా బ్రిటన్‌కు చెందిన రెండున్నర లక్షల మంది చిన్నారుల డేటాను వీరు పరిశీలించారు. వీరిలో ఐదేళ్ల నుంచి పదిహేడు సంవత్సరాల వయసు వరకు ఉన్న చిన్నారులు ఉన్నారు. ఈ యాప్ ద్వారా చిన్నారులకు ఉన్న లక్షణాలను వారి తల్లిదండ్రులు లేదా కేర్ టేకర్లు నిపుణులకు అందించారు. అయితే ఇందులో వారు స్కూల్‌కి వెళ్లారా? లేదా? అన్న విషయాలను మాత్రం తీసుకోలేదు.
2020 సెప్టెంబర్ 1 నుంచి 2021 ఫిబ్రవరి 22 వరకు చిన్నారుల వివరాలను తీసుకుంటే రెండున్నర లక్షల మందిలో కేవలం 1734 మంది కరోనాతో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత వారు ఆరోగ్యంగా మారేవరకు వారికి ఉన్న లక్షణాలన్నింటినీ ఈ యాప్‌లో పొందుపర్చారు. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే వీరిలో చాలామంది సగటున ఆరు రోజుల పాటు కరోనాతో బాధపడ్డారు. వీరందరిలోనూ లక్షణాలు తక్కువగానే ఉండడం విశేషం. అందుకే వీరంతా త్వరగా రికవర్ అయ్యారు.
చాలామంది దాదాపు నాలుగు వారాల సమయంలోపు తిరిగి మామూలుగా మారిపోయారు. నెలకు మంచి లక్షణాలతో బాధపడిన వారి సంఖ్య (77/1,734) చాలా తక్కువగా ఉంది. వారికి కూడా ఒకటి లేదా రెండు లక్షణాలు మాత్రమే అన్ని రోజులు కొనసాగడం విశేషం. ఈ అధ్యయనం ద్వారా పిల్లల్లో కరోనా లక్షణాలు వచ్చినా వారి రోగ నిరోధక శక్తి వేగంగా ప్రతిస్పందిస్తుందని తేలింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Covid - 19 symptoms "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0