Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Covshield Side Effects release central Gov in India.

భారత్ లో కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ విడుదల చేసిన కేంద్రం.

Covshield Side Effects release central Gov in India.

   కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం ఓ కమిటిని నియమించింది.కమిటీ సభ్యులు... డేటాను సేకరించారు. ఓ రిపోర్ట్ తయారుచేసి కేంద్రానికి ఇచ్చారు. దాని ప్రకారం.. దేశంలో... ప్రతి 10 లక్షల డోసుల్లో... 0.61 మందికి మాత్రమే... వ్యాక్సిన్ వేశాక... రక్తం గడ్డ కడుతున్నట్లు అవుతోందని తెలిపింది. అంటే... 20 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా అవుతోందని అనుకోవచ్చు.

ఇలా రక్తం గడ్డకట్టడాన్ని థ్రాంబోబోలిక్ (Thromboembolic events) ఈవెంట్స్ అంటారు. ఇందులో రక్తనాళంలో రక్తం గడ్డ కడుతుంది. ఒక రక్త నాళం నుంచి మరో రక్త నాళానికి రక్త సరఫరా ఆగిపోతుంది. ఇలా ఎవరికైనా అవుతుందేమో పరిశీలించమని కేంద్ర ఆరోగ్య శాఖ... హెల్త్ కేర్ వర్కర్లకు సూచన చేసింది. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రావొచ్చో... వ్యాక్సిన్ వేసుకున్నవారికి చెప్పి... వారిలో అవగాహన కలిగించమని తెలిపింది. వ్యాక్సిన్ (ముఖ్యంగా కోవిషీల్డ్) వేసుకున్న తర్వాత 20 రోజుల్లో కొన్ని రకాల లక్షణాలు కనిపించే అవకాశం ఉంది అని తెలిపింది. ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే... వారు ఎక్కడ వ్యాక్సిన్ వేయించుకున్నారో అక్కడ ఆ విషయం చెప్పేలా చెయ్యమని హెల్త్ కేర్ వర్కర్లకు కేంద్రం చెప్పింది.

మరి ఆ లక్షణాలు ఏంటో మనకూ తెలిస్తే... ఇక హెల్త్ కేర్ వర్కర్లు మనకు చెప్పాల్సిన అవసరం ఉండదు. అవి ఇవే అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ వాటిని వివరించింది.

ఆ లక్షణాలు

  • ఊపిరి ఆడకపోవడం (breathlessness)
  • రొమ్ములో నొప్పి (pain in chest)
  • కాళ్లు, చేతుల్లో నొప్పి లేదా వాపు రావడం (pain in limbs/swelling in limbs)
  • ఇంజెక్షన్ గుచ్చిన చోట ఎర్రగా కందిపోవడం లేదా... చర్మం కాలినట్లు అవ్వడం.
  • కంటిన్యూగా కడుపులో నొప్పి (వాంతులు అవుతూ నొప్పి రావడం లేక అవ్వకుండా నొప్పి రావడం)
  • మూర్ఛ రావడం. (వాంతులు అవుతూ రావడం లేక అవ్వకుండా రావడం)
  • తీవ్రమైన తలనొప్పి (వాంతులు అవుతూ రావడం లేక అవ్వకుండా రావడం)
  • నీరసం లేదా పక్షవాతం
  • కారణం లేకుండా వాంతులు రావడం
  • కళ్లు మసకబారడం, కళ్లలో నొప్పి, రెండేసి దృశ్యాలు కనిపించడం (having double vision)
  • అయోమయంగా ఉండటం, ఒత్తిడితో అయోమయంగా ఉండటం.

ఇవి కాకుండా ఇంకేమైనా అనారోగ్య సమస్యలు వస్తే... కూడా వ్యాక్సిన్ వేయించుకున్న చోటికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి.

ఈ AEFI కమిటీ... దేశంలోని 498 సీరియస్ కేసుల్ని పరిశీలించింది. వాటిలో 26 కేసుల్లో మాత్రమే రక్తం గడ్డకట్టినట్లు అయ్యిందని చెప్పింది. సో... ఇప్పుడు మనకు ఆ సైడ్ ఎఫెక్టులేంటో అర్థమైపోయింది. మనకు గానీ, చుట్టుపక్కల ఎవరికైనా ఇలాంటి లక్షణాలు మనం చూస్తే... వెంటనే అలర్ట్ అవ్వొచ్చు, లేదా వారిని అలర్ట్ చెయ్యవచ్చు...


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Covshield Side Effects release central Gov in India."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0