Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CRPF Recruitment

 CRPF Recruitment : కేంద్ర బలగాల్లో 2439 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక .

CRPF Recruitment

భారత హోం​ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 2439 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఎంపికైన వారిని ఏఆర్​, సీఆర్​పీఎఫ్​, ఐటీబీపీ, ఎస్​ఎస్​బీ, బీఎస్​ఎఫ్​ వంటి కేంద్ర బలగాల్లోకి తీసుకుంటారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారానే ఈ నియామకాలు చేపట్టడం విశేషం. ఈ వాక్​ఇన్​ ఇంటర్వ్యూ లు 2021 సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 15 మధ్య నిర్వహిస్తారు. అయితే, కేవలం రిటైర్డ్​ సీఏపీఎఫ్​, సాయుధ దళాల్లో పనిచేసిన మాజీ ఉద్యోగులకు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అది కూడా పురుష అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు సీఆర్పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్ ww.crpf.gov.in ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు : 2439

విభాగాల వారీ ఖాళీలు
ఈ నోటిఫికేషన్​ ద్వారా వివిధ కేంద్ర బలగాల్లో మొత్తం 2439 ఖాళీలను భర్తీ చేస్తారు. 

  • ఆర్మ్డ్​ రిజర్వ్​డ్​ (ఏఆర్​)లో 156
  • బీఎస్​ఎఫ్​లో 365
  • సీఆర్​పీఎఫ్​లో 1537
  • ఐటీబీపీలో 130
  • ఎస్​ఎస్​బీలో 251 
  • ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హత ప్రమాణాలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా CAPF, AR వంటి సాయుధ దళాల్లో పనిచేసిన రిటైర్డ్ సిబ్బంది అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 62 ఏళ్లకు మించకూడదు.

ఇంటర్వ్యూలో గుర్తించుకోవాల్సిన అంశాలు

  • వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరయ్యే సందర్బంలో అభ్యర్థులు కచ్చితంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఇంటర్వ్యూకి తప్పనిసరిగా వారి ఒరిజినల్​, జిరాక్స్​ సర్టిఫికెట్లను తీసుకెళ్లాలి. 
  • రిటైర్​మెంట్​ సర్టిఫికేట్ 
  • డిగ్రీ మెమో 
  • ఏజ్​ ప్రూఫ్​ సర్టిఫికెట్​ 
  • ఎక్స్​పీరియన్స్​ సర్టిఫికెట్​ 
  • ఇటీవలి 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు వంటివి అందజేయాలి. 
  • ఇంటర్వ్యూలో అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి ఆ తర్వాత మెడికల్ టెస్ట్ చేస్తారు. 
  • వీటి ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 
  • కాగా, ఎంపికైన అభ్యర్థులకు వేతనం మాత్రమే లభిస్తుంది. 
  • వారికి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, గ్రాట్యుటీ, మెడికల్ అటెండెన్స్ ట్రీట్మెంట్, సీనియారిటీ, ప్రమోషన్ వంటి ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CRPF Recruitment"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0