Explanation of what to eat to keep the brain healthy
మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏవి తినాలో వివరణ
మెదడు ఆరోగ్యంగా ఉండి జ్ఞాపక శక్తి పెరగాలంటే ఫ్లేవనాయిడ్స్ ఉండే పండ్లు, కూరగాయలు తినటం చాలా మంచిది.అలాగే క్యారెట్లు, స్ట్రాబెర్రీలు, యాపిల్స్ సహా ఇతర పండ్లు ఎక్కువగా తింటే మెదడు చాలా చురుగ్గా పని చేస్తుంది.ఇక క్యారెట్లలో బీటా కెరోటిన్ ఇంకా స్ట్రాబెర్రీలలో ఉండే ఫ్లేవోన్ అలాగే యాపిల్స్‌లో ఉండే ఆంథోసైనిన్ మెదడులోని నరాలను బాగా ఉత్తేజితం చేస్తాయని అందువల్ల మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణుల పరిశోధనలో తేలింది.
అలాగే ఎర్ర ద్రాక్షలో కూడా కామన్ ఫ్లేవనాయిడ్స్ అనేవి ఉంటాయి. వేరే ద్రాక్షతో పోలిస్తే ఈ ఎర్ర ద్రాక్షల్లో ఫ్లేవనాయిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ ఇంకా రాస్బెర్రీ లాంటి బెర్రీ జాతికి చెందిన పండ్లలో యాంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా ఫ్లేవనాయిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బ్రెయిన్ పనితీరును ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మన మెదడులో ఏర్పడే ఆక్సీకరణ ఒత్తిడిని ఇవి తగ్గిస్తాయి.
బెర్రీ పండ్లను రోజూ తినటం వల్ల అన్ని వయసుల వారిలోనూ జ్ఞాపకశక్తి పెరుగుతుందని నిపుణులు చేసిన పలు అధ్యయనాల్లో తేలడం జరిగింది.ఇక కమలాపండ్లు వల్ల కూడా మంచి ఫ్లేవనాయిడ్స్ మెదడుకి అందుతాయి. కమలా కాయలో ఉండే ఫ్లేవనాయిడ్స్ జలుబు, ఫ్లూ ఇంకా దగ్గు వంటి సమస్యల నుండి తగ్గిస్తుంది. ప్రతి రోజూ కూడా ఆరెంజ్ జ్యూస్ ని తాగడం వల్ల మెదడుకి మంచి ఫ్లేవనాయిడ్స్ అంది మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో సహాయ పడుతుంది.అలాగే క్యాబేజ్ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.ప్రమాదకరమైన వైరస్ నుంచి క్యాబేజ్ మనల్ని రక్షించి బయట పడేస్తుంది.ఎర్ర క్యాబేజ్ లో వుండే ఫ్లేవనాయిడ్స్ మెదడుకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి ఎర్ర క్యాబేజీని ఎక్కువగా తినడం చాలా మంచిది. అలాగే సోయా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో వుండే ఫ్లెవనాయిడ్స్ రైనో వైరస్, ఇన్ఫ్లుఎంజా వైరస్ లాంటి వాటి నుంచి కాపాడి మెదడుని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది.
0 Response to "Explanation of what to eat to keep the brain healthy"
Post a Comment