Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to find out which number is linked to Aadhaar.

ఆధార్ కి ఏ నంబర్ లింక్ చేశారో తెలుసుకొనే విధానం.

How to find out which number is linked to Aadhaar.

ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం అనేది తప్పనిసరి అయిపోయింది . అంతేకాదు అథెంటికేషన్ కూడా సులువు అవుతోంది . అంటే ఎక్కడైనా మీ ఆధార్ నెంబర్‌ను ఉపయోగించినప్పుడు , ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుందన్నమాట . దీని ద్వారా ఆధార్ నెంబర్‌ను ఇతరులు దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవచ్చు . అయితే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసిన సమయంలో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చాం అన్న సంగతి చాలామందికి గుర్తుండదు . ఒకరి దగ్గరే రెండు మూడు ఫోన్ నెంబర్లు ఉండటం లేదా ఫోన్ నెంబర్లు మార్చి కొత్తవి తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది . దీంతో ఓటీపీ విషయంలో తిప్పలు తప్పవు . అసలు ఏ నెంబర్ కు ఓటీపీ వెళ్తుందో కూడా కొన్ని సందర్భాల్లో తెలియని పరిస్థితి . మరి ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ లింక్ అయిందన్న విషయం తెలుసుకోవడం ఎలా అయితే అలాంటి వారికి చాలా సులువుగా తెలుసుకునే ఫెసిలిటీ వచ్చేసింది .  

ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ తెలుసుకొను విధానం.

  • మొట్టమొదట వెబ్ సైట్ కి వెళ్లాలి . 
  • తొలుత యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI అధికారిక వెబ్ సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి . 
  • వెబ్ సైట్ ఓపెన్ అయిన తర్వాత My Aadhaar సెక్షన్ లో Aadhaar Services లో Verify Email / Mobile Number ఆప్సన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది . 
  • అప్పుడు మీకు కొత్త విండో ఓపెన్ అవుతుంది . 
  • అందులో ఆధార్ నెంబర్ , మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి . 
  • ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి 
  • చేసిన తర్వాత Send OTP పై క్లిక్ చేయాలి . 
  • మీరు సరైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే The Mobile Number XXXXXXXXXX matches with our records అని వస్తుంది . 
  • మీరు ఆధార్ నెంబర్ కు లింక్ లేని మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే The Mobile number you had entered does not match with our recordse ని వస్తుంది . 
  • ఇలా వచ్చినప్పుడు మీరు మరో నెంబర్ తో ప్రయత్నించాలి .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to find out which number is linked to Aadhaar."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0