Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Identification of 11 thousand employees who received rice cards

తిరిగి ఇచ్చెయ్యాల్సిందే.

Identification of 11 thousand employees who received rice cards

బియ్యం కార్డులు పొందిన 11 వేల మంది ఉద్యోగుల గుర్తింపు

 జిల్లాలో 11వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు బియ్యం కార్డులు ఉన్నట్లు తేలింది. వీరంతా స్వచ్ఛందంగా ఈ నెలాఖరులోగా వాటిని సచివాలయాల్లో అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటిలో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే ఆ కుటుంబాన్ని బీపీఎల్‌గా పరిగణించరు. దీన్ని ఆధారంగా చేసుకుని అలాంటి వారిని గుర్తించి గ్రామ/వార్డు సచివాలయాల వారీగా జాబితాలను విడుదల చేశారు. సంబంధిత ఉద్యోగికి నోటీసులు జారీ చేశారు. గత ఏడాది పెద్ద ఎత్తున గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులను భర్తీ చేశారు. వారికి త్వరలో ప్రొబేషన్‌ ఇవ్వవలసి ఉంది. దీని కోసం ఎటువంటి అవరోధాలు ఉండకూడదు. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న శాశ్వత, ఒప్పంద విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి బియ్యం కార్డులను సరెండర్‌ చేయాలని ఆదేశించారు.

రెండురోజుల్లో వెయ్యి మంది

ఉత్తర్వులిచ్చిన రెండు రోజుల వ్యవధిలో జిల్లాలో వెయ్యి మంది ఉద్యోగులు వాటిని సరెండర్‌ చేశారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రేషన్‌కార్డుల ఏరివేత కార్యక్రమం చేపట్టినా కొంత మంది తప్పించుకున్నారు. ఈసారి ఆధార్‌, రేషన్‌, ట్రెజరీ, వివిధ శాఖల ఉద్యోగుల డేటాను అనుసంధానం చేసి బియ్యం కార్డులున్న వారిని గుర్తించారు. వారందరికీ ఇప్పుడు నోటీసులు ఇచ్చారు.

కొంత గడువు ఇచ్చాం..

ప్రభుత్వ ఉద్యోగికి బియ్యంకార్డు ఉండకూడదు. వాటిని సరెండర్‌ చేయాలని గడువు ఇచ్చాం. అప్పటికీ ఇవ్వకపోతే షోకాజ్‌ నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సచివాలయ ఉద్యోగులకు త్వరలో ప్రొహిబిషన్‌ డిక్లేర్‌ చేస్తారు. ఈలోగా వీరికి బియ్యంకార్డు ఉండకూడదు. పేదలైన తల్లిదండ్రులతో పెళ్లికాని కుమార్తె బియ్యం కార్డులో ఉండి, ఆమె ప్రభుత్వ ఉద్యోగైతే తప్పనిసరిగా కార్డు సరెండర్‌ చేయాల్సిందే.


*-జి.లక్ష్మీశ, సంయుక్త కలెక్టర్‌(రెవెన్యూ)*



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Identification of 11 thousand employees who received rice cards"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0