Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspire Fellowship

 Inspire Fellowship: ఇన్‌స్పైర్ ఫ్యాకల్టీ ఫెలోషిప్... నెలకు రూ.1,25,000 స్టైపెండ్... అప్లై చేసుకొనే విధానం.

Inspire Fellowship

Inspire Fellowship  పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారికి శుభవార్త. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెలకు రూ.1,25,000 స్టైపెండ్‌తో ఫెలోషిప్ స్కీమ్ (Fellowship Scheme) ప్రకటించింది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోగలరు.

ఉన్నత విద్య తరువాత ఉత్తమ పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. Department of Science and Technology సైతం పరిశోధకులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా INSPIRE Faculty Fellowship Scheme- 2021 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పథకం కింద ఇండిపెండెంట్ రిసెర్చ్‌కు అవకాశం ఉన్న వారికి పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్స్ అందిస్తుంది. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబరు 4. ఈ ఫెలోషిప్ కు అర్హత పొందడానికి, అభ్యర్థి భారతీయ పౌరుడై ఉండాలి. లేదా భారత సంతతికి చెంది పీఐఓ (PIO) హోదాతో పాటు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ డిగ్రీ (సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడిసిన్, అగ్రికల్చర్ సంబంధిత సబ్జెక్టుల్లో) కలిగి ఉండాలి. ఇది కాకుండా అభ్యర్థులు హయ్యర్ సెకండరీ పరీక్ష(12వ తరగతి తర్వాత) నుంచి ప్రారంభమయ్యే అకడమిక్ ప్రొఫైల్‌లో కనీసం 60 శాతం (లేదా సమానమైన సీజీపీఏ) మార్కులను కలిగి ఉండాలి.

పీహెచ్‌డీ కోసం ఎదురుచూస్తున్నవారు కూడా అర్హులే..

పీహెచ్‌డీ థీసీస్ సమర్పించి, డిగ్రీ కోసం ఎదురుచూస్తోన్న వారు కూడా ఈ ఫెలోషిప్‌కు అర్హులే. అయితే PhD డిగ్రీని పొందిన తర్వాతే ఫెలోషిప్ కోసం ఎంపికను నిర్దారిస్తారు. అంతేకాకుండా అభ్యర్థులకు 2021 జనవరి 1 నాటికి గరిష్ఠ వయోపరిమితి 32 సంవత్సరాలు మించకూడదు.

క్రమశిక్షణ-ఆధారిత నిపుణుల కమిటీల(INSA) ద్వారా దరఖాస్తులు మూడు అంచెల్లో మూల్యాంకనం జరుగుతుంది. ఈ ప్రక్రియ తర్వాత తుది ఎంపిక ఉంటుంది. ఈ విధానం అపెక్స్ స్థాయి కమిటీ(INSA), INSPIRE ఫ్యాకల్టీ అవార్డ్ కౌన్సిల్(DST) సిఫార్సులకు అనుగుణంగా ఉంటుంది. ఎంపికైన ప్రతి INSPIRE ఫ్యాకల్టీ ఫెలోకు నెలకు రూ.1,25,000 స్టైపెండ్ అందిస్తారు. విజయవంతమైన ప్రతి అభ్యర్థికి అదనంగా 5 ఏళ్ల వరకు ప్రతి ఏడాది రూ.7 లక్షల రీసెర్చ్ గ్రాంట్ లభిస్తుంది.

Inspire Fellowship: అప్లై చేయండి ఇలా

  • Step 1- ముందుగా https://online-inspire.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • Step 2- హోమ్ పేజీలో NEW USER REGISTRATION పైన క్లిక్ చేయాలి.
  • Step 3- ఇమెయిల్ ఐడీ, పేరు, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్‌తో రిజిస్ట్రేషన్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
  • Step 4- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, టెన్త్ మార్క్స్ షీట్, క్యాస్ట్ సర్టిఫికెట్, లెటర్ ఆఫ్ అపాయింట్‌మెంట్, ఇతర సర్టిఫికెట్స్ అఫ్‌లోడ్ చేయాలి.
  • Step 5- ఆ తర్వాత యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయాలి.
  • Step 6- Faculty పైన క్లిక్ చేయాలి.
  • Step 7- Apply for Faculty పైన క్లిక్ చేయాలి.
  • Step 8- వివరాలన్నీ సరిచూసుకొని సేవ్ చేయాలి.
  • Step 9- చివరగా దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inspire Fellowship"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0