Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Key decisions of the AP Cabinet

 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు


ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి పేర్ని నాని కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు.. 

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. మూడున్నర గంటలపాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో పలు అంశాలకు కేబినెట్​ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. మూడున్నర గంటలపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. జగనన్న విద్యాకానుక, నాడు-నేడుపై కేబినెట్‌లో చర్చ జరిగినట్లు సమాచారం. ఈ నెల 10న అమలు చేయనున్న 'వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం' పథకంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పలు అంశాలకు కేబినెట్​ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

పులిచింతల గేట్‌ అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. స్టాప్‌లాక్ గేట్‌, హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటుపై 20 నిమిషాలపాటు చర్చించారు. గతంలో వివిధ ప్రాజెక్టుల్లో జరిగిన ప్రమాదాలపై కేబినెట్​ సమావేశంలో మాట్లాడారు.
  • నాడు-నేడు కింద 34 వేల ప్రాథమిక పాఠశాలల అభివృద్ధి 
  • రెండు భాషల్లో పాఠ్యపుస్తకాల అందజేత 
  • ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి 
  • విద్యా వ్యవస్ధ బలోపేతానికి కృషి 
  • టీచర్ల తొలగింపు ప్రసక్తే లేదు 
  • నూతన విద్యావిధానం స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరణ ఖరారు 
  • శాటిలైట్ స్కూల్స్ (పీపీ-1, పీపీ-2) 
  • ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ-1, పీపీ-2.1,2) 
  • ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ (పీపీ-1 నుంచి 5వ తరగతి వరకు) 
  • ప్రీ హైస్కూల్స్ (3నుంచి 7 లేదా 8వ తరగతి వరకు) 
  • హైస్కూల్స్ (3 నుంచి 10వ తరగతి వరకు) 
  • హైస్కూల్ ప్లస్ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) 
  • ఈనెల 16న విద్యాకానుక 
  • ఆగస్ట్ 10న మూడో విడత నేతన్న నేస్తం. నేతన్న నేస్తానికి రూ.200 కోట్లు కేటాయింపు 
  • ఈనెల 24న అగ్రిగోల్డ్ బాధితుల్లో 10-20 వేల మధ్య ఉన్న డిపాజిట్ దారులకు నగదు. 
  • పంచాయతీ, మున్సిపల్ పరిధిలోని అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను క్రమబద్ధికరణకు ఆమోద ం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Key decisions of the AP Cabinet"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0