Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Let's open the school doors ..

 పాఠశాల తలుపులు తెరుద్దాం..

Let's open the school doors ..


రోజు విడిచి రోజు తరగతులు..

లేదంటే ఉదయం, మధ్యాహ్నం షిఫ్టులు..

పార్లమెంటు స్థాయీ సంఘం సిఫార్సు..

ఈనాడు, దిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా ఇంకా పాఠశాలల్ని మూసి ఉంచితే విద్యార్థులపై మరింత ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలతో వాటిని తెరవాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. భాజపా రాజ్యసభ ఎంపీ వినయ్‌సహస్రబుద్ధే నేతృత్వంలోని విద్య, మహిళా శిశు సంక్షేమం, క్రీడలు, యువత వ్యవహారాల స్థాయీ సంఘం ఈ అంశంపై నివేదిక సమర్పించింది. పాఠశాలల్లో రద్దీ నివారణకు రోజు మార్చి రోజూకానీ, ఉదయం-మధ్యాహ్నం షిఫ్టుల్లోకానీ తరగతులు నిర్వహించాలని పేర్కొంది. ‘‘ఏడాదికిపైగా పాఠశాలలు మూసేయడం విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. బడులు తెరవకపోతే తలెత్తే ప్రమాదాలను విస్మరించ తగదు. ఇంటి నాలుగు గోడలకే పరిమితం కావడం వల్ల పిల్లలు, తల్లిదండ్రుల మధ్య సంబంధాల్లో ప్రతికూల పరిస్థితులు తలెత్తుతున్నాయి. చాలామందికి బాల్య వివాహాలు చేసే పరిస్థితి వచ్చింది. చిన్నారులకు ఇంటి పనులు అప్పగిస్తున్నారు. నిరుపేద, దుర్బల వర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. సమస్య తీవ్రతను ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించడానికి వీల్లేదు. ఇందుకు అత్యంత సమతౌల్యమైన మార్గాన్ని ఎంచుకోవాలి’’ అని నివేదిక పేర్కొంది.

కమిటీ సూచనలు..

విద్యార్థులు, ఉపాధ్యాయులు, అనుబంధ సిబ్బందికి వ్యాక్సిన్‌లు అందించాలి. తద్వారా పాఠశాలలు సాధారణ స్థాయిలో పనిచేయడానికి వీలవుతుంది.```

స్కూళ్లలో రద్దీని తగ్గించడానికి రోజు మార్చి రోజుకానీ, ఉదయం-మధ్యహ్నం వేర్వేరు షిఫ్ట్‌లలో కానీ తరగతులు నిర్వహించాలి. పాఠశాలలో ఉన్నంత వరకూ మాస్కులు ధరించడంతో పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకొనేలా జాగ్రత్తలు తీసుకోవాలి.```

హాజరు సమయంలో ఉష్ణోగ్రతలు పరీక్షించాలి. అలాగే ఉజ్జాయింపుగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు (ర్యాండం టెస్ట్‌) నిర్వహించి వైరస్‌ సోకిన విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది ఉంటే వారిని వెంటనే వేరు చేయాలి.```

ప్రతి పాఠశాలలో ఒక సిక్‌ రూం, అత్యవసర వైద్యసౌకర్యాలు, మందులు సమకూర్చాలి. పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వారిని వెంటనే ఈ గదికి తరలించి ప్రాథమిక వైద్య సేవలు అందించాలి.```

కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలి. పాఠశాల యాజమాన్యం, అధికారులు, టీచర్లు, విద్యార్థులు, అనుబంధ సిబ్బంది, తల్లిదండ్రులు, సందర్శకులు బస్సు, ట్యాక్సీ డ్రైవర్లతో పాటు పాఠశాలలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలి.```

ప్రతి స్కూల్‌లో కనీసం రెండు ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్లు ఏర్పాటు చేయాలి. అత్యవసర పరిస్థితి ఎదురైతే ప్రాథమిక వైద్యాన్ని అందించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి.```

ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు శానిటైజర్‌, ఫేస్‌మాస్కులు క్రమం తప్పకుండా పంపిణీ చేయాలి.```

హెల్త్‌ ఇన్స్‌పెక్టర్లు, హెల్త్‌ వర్కర్లూ తరచూ పాఠశాలలను సందర్శించి కొవిడ్‌ ప్రొటోకాల్స్‌, పరిశుభ్రత పాటిస్తున్నారా? లేదా? అన్నది తనిఖీచేయాలి.```

పాఠశాలలు తెరవడానికి ప్రపంచ దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను పరిగణనలోకి తీసుకోవాలి.```

ఇప్పటివరకు జరిగిన అభ్యాస నష్టాన్ని భర్తీచేయడానికి నిపుణులతో సంప్రదించి బ్రిడ్జ్‌ కోర్సులు నిర్వహించాలి.```

మహమ్మారి సమయంలో విద్యార్థులు నేర్చుకున్న అంశాలను తెలుసుకోవడానికి తరచూ బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, క్విజ్‌ల రూపంలో పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థి శక్తిసామర్థ్యాలను బట్టి ప్రతి ఒక్కరినీ వేర్వేరు రూపాల్లో పరీక్షించాలి.```

అదనపు తరగతులు తీసుకోవాలి. సెలవులు తగ్గించాలి. చదువుల్లో వెనుకబడిన పిల్లల బాధ్యతలను టీచర్లకు వ్యక్తిగతంగా అప్పచెప్పాలి. తరచూ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉండాలి. జూనియర్‌ స్టూడెంట్స్‌కి సీనియర్లు మార్గదర్శనం చేసేలా, వారికి తరగతులు చెప్పేలా ప్రోత్సాహించాలి.```

ప్రతి సబ్జెక్ట్‌ కోసం ఒక హెల్ప్‌లైన్‌ ఏర్పాటుచేసి, అందులో వచ్చే అనుమానాలను ఎప్పటికప్పుడు వారు నివృత్తిచేసుకొనే వెసులబాటు కల్పించాలి. విషయ నిపుణుల ఆధ్వర్యంలో టీవీలు, కమ్యూనిటీ రేడియోల ద్వారా ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాలు నిర్వహించాలి. టీచర్లు, సబ్జెక్ట్‌ నిపుణులతో వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటుచేసి వాటి ద్వారా విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చాలి.```

ఛాట్‌బోట్‌లాంటి ఉత్తమ ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ విధానాన్ని ప్రోత్సహించాలి. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని మ్యాపింగ్‌ చేసి ప్రత్యేక సాయం అవసరమైన విద్యార్థులను గుర్తించాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Let's open the school doors .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0