Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

National award for two teachers

ఇద్దరు టీచర్లకు జాతీయ పురస్కారం

National award for two teachers

  • ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించిన కేంద్రం
  •  చిత్తూరు, విశాఖ జిల్లాల అధ్యాపకులకు అవార్డు

 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఏపీ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం ఎం.పైపల్లె జడ్పీ హైస్కూలులో గణిత ఉపాధ్యాయుడు ఎస్‌.మునిరెడ్డి, విశాఖజిల్లా ఎస్‌.రాయవరం మండలం, లింగరాజుపాలెం జిల్లా పరిషత్‌ హైస్కూలులో సాంఘికశాస్త్రం బోధించే కొణతాల ఫణిభూషణ్‌ శ్రీధర్‌ కు కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 44 మంది అవార్డులకు ఎంపిక కాగా, ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపికైనట్లు కేంద్రవిద్యాశాఖ బుధవారం వెల్లడించింది. 

ఒక్కరోజూ సెలవు పెట్టరు

చిత్తూరు జిల్లా సోమల మండలం నంజంపేట పంచాయతీ కమ్మపల్లెకు చెందిన మునిరెడ్డి చదువులో చురుగ్గా ఉండేవారు. ఒకటో తరగతి నుంచీ పీజీ దాకా కూడా ఫస్ట్‌ క్లాస్‌ స్టూడెంట్‌. ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ తర్వాత సైకాలజీ, ఇంగ్లీషు, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లోనూ పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఆపై ఎంఈడీ, ఎంఫిల్‌ కూడా చేసి చివరగా సైకాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్‌ సాధించారు. ఈయనకు గైడెన్స్‌ అండ్‌ కౌన్సిలింగ్‌లో పీజీ డిప్లొమా కూడా ఉంది.

1989 ఆగస్టు 17న ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరిన మునిరెడ్డి 32 ఏళ్ల సర్వీసులో పాఠశాలకు సెలవు పెట్టడం అత్యంత అరుదు. మొత్తం సర్వీసులో ఏడేళ్ల పాటు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా విధులకు హాజరయ్యారు. ఆయన పనిచేసిన ప్రతి పాఠశాలలోనూ గణితంలో పిల్లలకు రోజువారీ పని గంటలకు అదనంగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతు లు తీసుకుంటారు. విద్యార్థుల్లో గణితం పట్ల భయం, అపోహలు పోగొట్టి, ఆ స్థానంలో ఆసక్తి కలిగించే రీతిలో ‘సంకల్పం’, ‘మహా సంకల్పం’, ‘విజయో స్తు’, ‘విజయస్థాపన’ అనే పుస్తకాలు రాశారు. మునిరెడ్డి కృషి ఫలితంగా  పిల్లలు గణితంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. 

సోషల్‌ టీచర్‌కు పట్టం

విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ఫణిభూషణ్‌ శ్రీధర్‌ సుమారు 25ఏళ్ల క్రితం ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా చేరారు. ఈ ఏడాది జనవరిలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది, లింగరాజుపాలెం ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చారు. సాంఘిక శాస్త్రం బోధించే ఫణిభూషణ్‌ గతంలో జిల్లా, రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు పొందారు. ఇంకా నేషనల్‌ ఇన్నోవేటివ్‌ అవా ర్డు, ఎయిర్‌ ఇండియా బ్రాడ్‌ అవుట్‌లుక్‌ లెర్నర్‌ టీచర్‌ అవార్డు పొందారు. 

బాధ్యతను పెంచింది

ప్రభుత్వం నుంచి గతంలో కూ డా జిల్లా, రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చాయి. అయితే ఇప్పుడు జాతీ య స్థాయిలో ఎంపికవడం చాలా సంతోషాన్ని కలిగించింది. ముఖ్యం గా రాష్ట్రానికంతా ఇద్దరే ఈ అవార్డుకు ఎంపిక కావడం, అందులో నేనూ ఒకరు కావడం గర్వంగా అనిపిస్తున్నా అంతకుమించి బాధ్యతను పెంచినట్టు భావిస్తున్నా.విద్యార్థులు గణితం పట్ల ఆసక్తిని పెంచుకునేలా కృషి చేసేందుకు ప్రయత్నిస్తా. 

మునిరెడ్డి, ఎం.పైపల్లె జడ్పీ హైస్కూలు, చిత్తూరు జిల్లా

గర్వంగా ఉంది 

పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో కృత్యాధార  బోధన జరిగితే విద్యార్థులు ఏ రంగంలో అయినా పోటీ పడగలరు. నేను విధు లు నిర్వహించిన పాఠశాలల్లో ఉత్త మ విద్యా ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవలకు గాను ఈ పురస్కారం లభించింది. ఈ ఏడాది రాష్ట్రం మొత్తం మీద జాతీయ అవార్డుకు ఎంపికైన ఇద్దరిలో నేను ఒకడిని కావడం గర్వంగా ఉంది.  

కొణతాల ఫణిభూషణ్‌ శ్రీధర్‌, లింగరాజుపాలెం జడ్పీ హైస్కూల్‌, విశాఖ జిల్లా


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "National award for two teachers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0