Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NEET 2021: Alert for NEET candidates .. NTA key references in case of OMR sheets.

 NEET 2021 : నీట్ అభ్యర్థులకు అలర్ట్ .. OMR షీట్ల విషయంలో NTA కీలక సూచనలు .

NEET 2021: Alert for NEET candidates .. NTA key references in case of OMR sheets.

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా అనేక ప్రవేశ పరీక్షలను అధికారులు నెలల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆ పరీక్షలన్నింటినీ నిర్వహిస్తున్నారు అధికారులు.

సాధ్యమైనంత త్వరగా ఆ పరీక్షలకు సంబంధించిన కౌన్సెలింగ్ లను సైతం పూర్తి చేసి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీట్ 2021 పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తెలిపింది. తాజాగా పరీక్ష సందర్భంగా విద్యార్థులు OMR షీట్ ను ఎలా నింపాలన్న అంశంపై మార్గదార్శకాలను విడుదల చేసింది. నమూనా OMR షీట్ ను అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. విద్యార్థులు ఓఎంఆర్ షీట్ ను కేవలం బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ తోనే నింపాలని సూచించారు. ఓఎంఆర్ షీట్లను కంప్యూటర్ సాఫ్ట్ వేర్ తో మూల్యాంకనం చేయనున్నట్లు తెలిపారు. అయితే సరిగా నింపిన బ్లాక్ కలర్ బబుల్స్ ను మాత్రమే సాఫ్ట్ వేర్ గుర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు పరీక్షకు ముందుగా అధికారిక వెబ్ సైట్లో అప్ లోడ్ చేసిన సూచనలను పూర్తిగా చదవాలని సూచించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NEET 2021: Alert for NEET candidates .. NTA key references in case of OMR sheets."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0