Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

No benefit with mask, sanitizer .. Here are the latest research results ..

 మాస్క్ , శానిటైజర్ తో లాభంలేదు .. తాజా పరిశోధన ఫలితాలివే ..

No benefit with mask, sanitizer .. Here are the latest research results ..


మాస్క్ వేసుకోండి, శానిటైజర్ పూసుకోండి, సామాజిక దూరం పాటించండి. కరోనా మీ దరి చేరదు అంటూ ఇప్పటి వరకూ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు. అలా చేస్తే కేవలం కరోనాని మన దగ్గరకు రాకుండా కాపాడుకోగలం, మరి వైరస్ ని పూర్తిగా మన మధ్యనుంచి బయటకు పంపించాలంటే ఏం చేయాలి. కరోనాని వదిలించుకోడానికి మాస్క్, శానిటైజర్ పనికి రావు. అంతకు మించి చేయాల్సింది చాలా ఉందని అంటున్నారు ఇంగ్లండ్ లోని అలబామా యూనిర్శిటీ పరిశోధకులు.


హెర్డ్ ఇమ్యూనిటీ..
వైరస్ ని తట్టుకునేందుకు మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, ఆ రోగ నిరోధక శక్తి అందరిలోనూ రావడం వల్లే కరోనాని తరిమేయగలం అంటున్నారు అలబామా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు.
వైరస్ సోకిన తర్వాత దాన్నుంచి కోలుకున్నవారిలో ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటుంది. లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఈ ఇమ్యూనిటీ ఉంటుంది. ఈ రెండూ ఎంత ఎక్కువగా జరిగితే హెర్డ్ ఇమ్యూనిటీ రేటు అంత ఎక్కువ అవుతుంది. అప్పుడే కరోనా వైరస్ కట్టడి మొదలవుతుంది.

ఇప్పటి వరకూ పరిశోధకుల అంచనాలు భిన్నంగా ఉన్నాయి. హెర్డ్ ఇమ్యూనిటీ 60నుంచి 70శాతం సాధిస్తే చాలు కరోనా వైరస్ ని మన మధ్యనుంచి తరిమేయొచ్చు అనుకున్నారు. కానీ ప్రస్తుతం కొత్త వేరియంట్ల విజృంభణ, కరోనా ప్రతాపం చూశాక హెర్డ్ ఇమ్యూనిటీ కచ్చితంగా 90శాతం ఉండాల్సిందేనంటున్నారు. అంటే వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంత త్వరగా, ఎంత సమర్థవంతంగా జరిగితే అంత మంచిదన్నమాట. అప్పుడే కరోనాని అంతంచేయగలం అని స్పష్టం చేస్తున్నారు.

కొత్త వేరియంట్లలో డెల్టా రకం అత్యంత ప్రమాదకరం అని అది ఇప్పుడు 135 దేశాల్లో వ్యాపించి ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం చైనాలో కరోనా తిరగబెట్టడానికి కారణం కూడా డెల్టా వేరియంటేనని అంటున్నారు. ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లు చైనాలో మొదలై ప్రపంచ దేశాలకు వ్యాపిస్తే.. అవి రూపు మార్చుకుని డెల్టా రూపంలో చైనాపైనే తిరగబడ్డాయి. దీంతో చైనా కూడా క్రమక్రమంగా లాక్ డౌన్ లోకి వెళ్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "No benefit with mask, sanitizer .. Here are the latest research results .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0