Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ola Electric Scooter S1 Launched: Price, Features and Availability Details Here

 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1: ధర, ఫీచర్లు మరియు మిగతా ముఖ్యమైన వివరాలు. 

Ola Electric Scooter S1 Launched: Price, Features and Availability Details Here


ఓలా ఎల‌క్ట్రిక్‌ స్కూటర్ ను కంపెనీ `సీఈఓ` భ‌విష్ అగ‌ర్వాల్ నేడు మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్‌ చేశారు.

ఓలా స్కూట‌ర్ కీలెస్ వంటి కొన్ని సెగ్మెంట్‌-ఫ‌స్ట్ ఫీచ‌ర్ల‌తో వ‌స్తుంది. స్కూట‌ర్‌లో రివ‌ర్స్ మోడ్ (వెన‌క్కి తీసుకోవ‌డం) లాంటి సౌక‌ర్యాలు కూడా ఉంటాయి.

ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఎస్‌1 మోడల్‌ ధర రూ.99,999గా ఉంటే ఎస్‌1 ప్రో మోడల్‌ ధర రూ.1,29,999గా నిర్ణయించారు. ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఓలా ఎలక్ట్రిక్ లాంఛింగ్‌ ఈవెంట్‌లో ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీ ఇచ్చే విధంగా ఈ స్కూటర్క్ ధర ఉంది.

ప్రత్యేకతలు:

  •  ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ S1, S1 ప్రో అనే రెండు విభిన్న వేరియంట్లలో విడుదల అయ్యింది.
  • S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 50-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, ఎల్‌ఈడీ లైటింగ్ అధునాత ఫీచర్లు అందిస్తోంది.
  • ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పది రంగుల్లో లభిస్తోంది.
  • ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్‌ మోడ్‌లో కూడా పరుగులు తీస్తుంది.
  • ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90, ఫుల్ ఛార్జ్ చేస్తే 121 కి.మీల దూరం వెళ్లనుంది. 
  • ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.6 సెకన్లలో 0-40 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది.
  • ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 115 కి.మీ. ఫుల్ ఛార్జ్ చేస్తే 181 కి.మీ. దూరం వెళ్లనుంది.
  • ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3 సెకన్లలో 0-40 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది.
  • ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 18 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
  • లక్షకు పైగా ప్రీ బుకింగ్స్‌ను సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది.

ఓలా మెగా ఫ్యాక్టరీ

  • ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హోం డెలివరీ పద్దతిలో కస్టమర్లకు అందివ్వనున్నారు. ఇప్పటికే టెస్లా ఇదే పద్దతిలో తన కార్ల అమ్మకాలు చేపడుతోంది. ఆన్‌లైన్‌లో స్కూటర్‌ బుక్‌ చేసుకుంటే నేరుగా ఇంటికి వచ్చేస్తుంది. షోరూమ్‌ల వ్యవస్థ ప్రస్తుతానికి అందుబాటులో లేనట్టే.
  • 2021 ఫిబ్రవరిలో మొదటి స్కూటర్‌ని తయారు చేయడం ప్రారంభించగా ఫస్ట్‌ స్కూటర్‌ తయారీకి ఆరు నెలల సమయం పట్టింది.
  • తమిళనాడులో ఉన్న ఓలా మెగా ఫ్యాక్టరీలో స్కూటర్లు​‍ తయారవుతున్నాయి. ప్రారంభ దశలో ఏడాదికి 20 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసే అవకాశం ఉంది. గరిష్టంగా ఏడాదికి కోటి స్కూటర్ల తయారీ లక్క్ష్యంగా ఇక్కడ విస్తరణ పనులు జరుగుతున్నాయి.
  • స్కూటర్ సింపుల్ వన్, బజాజ్ చేతక్, ఏథర్ 450X, TVS iQubeలు ఓలా కంటే ముందే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మార్కెట్‌లో ఉన్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ola Electric Scooter S1 Launched: Price, Features and Availability Details Here"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0