Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

One , two years . is not Corona effect for ten years

 ఒకటి రెండేళ్లు కాదు .. పదేళ్ల పాటు కరోనా ప్రభావం 

One , two years . is not Corona effect for ten years

బాంబు పేల్చిన డబ్ల్యూ హెవో ఎమర్జెన్సీ టీమ్ 

జెనీవా , ఆగస్టు 1 : ఒకటి , రెండేళ్లు కాదు ... పదేళ్లపాటు కరోనా ప్రభావం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ ) తాజాగా హెచ్చరికలు చేసింది . కరోనా వైరస్ వ్యాప్తి మొదలై ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ టీమ్ శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యింది . ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెట్రోస్ అధ్నామ్ గ్యాబ్రియోసిస్ మాట్లాడుతూ .. కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉండనుందని అంచనా వేశారు . ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు , తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు . మొత్తం 30 మంది ( 18 మంది సభ్యులు , 12 మంది సలహాదారులు ) ఉన్న ఈ బృందం కరోనా పై సమీక్ష జరపడం ఇది నాలుగోసారి . మాన్లు ధరించడం , శానిటైజర్ల వాడకం , భౌతిక దూరం పాటించడం , సామూహిక ప్రదేశాలను మూసివేయడం వంటి చర్యలను కొనసాగించే విషయంపై కమిటీ సంస్థకు కొన్ని సిఫార్సులు చేసింది . తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైనా సూచనలు చేసింది . కరోనా విషయంలో శాస్త్ర సాంకేతి సంబంధమైన అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని .. ఇంకా చాలా వాటికి సమాధానం దొరకాల్సి ఉందన్నారు . ఇంకా చాలా మందికి వైరస్ ముప్పు పొంచి ఉందని ... ఇప్పటికే సోకి తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లోనూ మరోసారి విజృంభించే ప్రమాదం ఉందని అధ్యయనాల్లో తేలిందన్నారు . గతేడాది డిసెంబరు చివరిన చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్ ... ప్రపంచం మొత్తం వ్యాపించింది . ఇప్పటి వరకూ 1.77 కోట్ల మంది వైరస్ బారినపడగా .. 6.83 లక్షల మంది బలయ్యారు . అత్యధికంగా అమెరికాలో 47 లక్షల మందికి వైరస్ నిర్ధారణ కాగా .. 1.56 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు . ప్రస్తుతం ప్రాణాంతక కరోనా వైరకు వ్యాక్సిన్ కోసం 150 కి పైగా సంస్థలు తీవ్రంగా కృషిచేస్తున్నాయని , 2021 తొలినాళ్లలో కూడా అందుబాటులోకి రాకపోవచ్చని ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "One , two years . is not Corona effect for ten years"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0