Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Password: Hackers want unrecognizable passwords ..? Follow these .. Your account is secure!

 Password : హ్యాకర్లు గుర్తుపట్టలేని పాసవార్డులు కావాలా .. ? ఇవి పాటించండి .. మీ అకౌంట్ సురక్షితం !


Password: ప్రస్తుత తరుణంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. డిజిటల్‌ టెక్నాలజీ కూడా వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది. ఆర్థిక సంస్థలు, ఆర్థికేతర సంస్థలు తమ సేవలను ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్నాయి.

చాలా వరకు వ్యక్తిగత సమాచారం డిజిటల్‌గానే భద్రపర్చుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఇలాంటి సమాచారాన్ని తస్కరించేందుకు కొంత మంది హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. ఇ-మెయిల్స్‌తో పాటు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పూర్తి డేటాను దొంగిలించేందుకు కొత్త కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ప్రస్తుతం సైబర్‌ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇందుకు పోలీసులకు కూడా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇ-మెయిల్స్‌, ఇతర సోషల్‌ మీడియా అకౌంట్లకు సంబంధించి పాస్‌వర్డ్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఎవరు గుర్తు పట్టని విధంగా పాస్‌వర్డులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి మోసాల భారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. పాస్‌వర్డ్‌ను క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హ్యాకర్లు తెలుసుకోలేని విధంగా పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు.

భద్రత ఉండే పాస్‌వర్డ్‌లు.

  • పాస్‌వర్డ్‌లో కనీసం 8 క్యారెక్టర్స్‌ ఉండేలా చూసుకోవాలి. అంతకంటే ఎన్ని ఎక్కువ ఉంటే పాస్‌వర్డ్‌ అంత పటిష్ఠంగా ఉంటుంది.
  • పాస్‌వర్డ్‌లో అప్పర్ కేస్ అక్షరాలు, లోయర్ కేస్ అక్షరాలు, అంకెలతో పాటు గుర్తులను (సింబల్స్‌) ఉపయోగించాలి. ఉదాహరణకు.. svK@E7uG లాంటివి.
  • సాధారణ డిక్షరీ పదాలను ఉపయోగించకూడదు. ఉదాహరణకు itislocked లేదా thisismypassword లాంటి కామన్ పదాలను ఉపయోగించకూడదు. స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌లు ఉపయోగించడం ఎంతో మేలు.
  • చాలా మంది పాస్‌వర్డ్‌ సులభంగా గుర్తించుకునేందుకు కీబోర్డులో వరుసగా అక్షరాలను 'qwerty' లేదా 'asdfg' లేదా 'zxcvb' వంటి వాటిని ఉపయోగించడం మంచిది కాదు.
  • ఎప్పుడైన సరే పాస్‌వర్డ్‌లు పెట్టుకునేందుకు వరుస ఆంగ్ల పదాలు abcdefg, zyxwv, గానీ వరుస అంకెలు 12345678 గానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు.
  • సులభంగా ఊహించగల పదాలైన మీ పేరు, ఇంటి సభ్యుల పేర్లు, నాయకుల పేర్లు, మీ పిల్లల పేర్లు, మీ గ్రామం పేరు, ఇష్టమైన సెలబ్రేటీల పేర్లు, డోర్ బెల్‌, డోర్‌ 123 లాంటి కామన్ పదాలు పెట్టుకోకూడదు.
  • పాస్‌వర్డ్ కాస్త పెద్దగా ఉండేటట్లు చూసుకోవాలి. మీ పేరు, లేదా కుటుంబ సభ్యుల పేర్లకు పుట్టిన తేదీ, సంవత్సరం జోడించి పాస్‌వర్డ్‌గా పెడుతుంటారు చాలామంది. 
  • ఉదాహరణకు Kiran@1976. ఈ విధంగా పెడితే మోసగాళ్లు త్వరగా గురత్ఇంచే అవకాశం ఉంది. అందుకే పాస్‌వర్డ్‌లో ఇలాంటివి ఉండకుండా చూసుకోవడం మంచిది. ఎవ్వరు కూడా ఊహించని విధమైన పదాలను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకోవడం బెటర్‌ అని సూచిస్తు్న్నారు టెక్‌ నిపుణులు.
  • ఇలాంటి స్ట్రాంగ్‌ పాస్‌వర్డులు పెట్టుకోవడం వల్ల మీ బ్యాంకు అకౌంట్‌ గానీ, నెట్‌ బ్యాంకింగ్‌, ఫోన్‌పే, పేటీఎం, ఫేస్‌బుక్‌లతో ఇతర సోషల్‌ మీడియా అకౌంట్లు, బ్యాంకులకు, ఇతర వాటికి సంబంధించి అకౌంట్ల పాస్‌వర్డులు సురక్షితంగా ఉంటాయి. ప్రస్తుతమున్న టెక్నాలజీ కారణంగా హ్యాకర్లు పాస్‌వర్డులను సులభంగా గుర్తిస్తున్నారు. దీంతో వ్యక్తిగత వివరాలతో పాటు ఖాతాలో ఉన్న డబ్బులు సైతం మాయమయ్యే అవకాశం ఉంది. లేకపోతే తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. ఇప్పటికే గూగుల్‌ కూడా చాలా మంది ఎక్కువగా పెట్టుకునే సులభమైన పాస్‌వర్డ్‌లను సైతం విడుదల చేస్తూ అప్రమత్తం చేస్తోంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Password: Hackers want unrecognizable passwords ..? Follow these .. Your account is secure!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0