Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

UGC Scholarship

 UGC Scholarship : : విద్యార్థులకు నెలకు రూ .7,800 స్కాలర్షిప్ ... అప్లై చేసుకొనే విధానం.

UGC Scholarship


విద్యార్థులకు శుభవార్త. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ప్రకటించింది. వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్ అందించనుంది.

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన 1,000 మంది విద్యార్థులకు యూజీసీ స్కాలర్‌షిప్స్ లభిస్తాయి. టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్ కోసం దరఖాస్తు చేయొచ్చు. మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్-ME, మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ-MTech కోర్సులు చదివే వారికి నెలకు రూ.7,800, ఇతర పీజీ కోర్సులు చదివేవారికి నెలకు రూ.4,500 స్కాలర్‌షిప్ లభిస్తుంది. కోర్సులో చేరిననాటి నుంచి ఈ స్కాలర్‌షిప్స్ వర్తిస్తాయి. అయితే ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసేముందు విద్యార్థులు కొన్ని నియమనిబంధనల్ని గుర్తుంచుకోవాలి.

ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లాంటి కోర్సుల్ని నాన్ ప్రొఫెషనల్ కోర్సులుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ కోర్సులు చదివే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్ పొందేందుకు అర్హులు కాదు. ఇక కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివేవారికి కూడా ఈ స్కాలర్‌షిప్ స్కీమ్ వర్తించదు. రెండేళ్లు లేదా మూడేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చదువుతున్నవారు ఈ స్కాలర్‌షిప్ పొందొచ్చు. ఎంపికైన విద్యార్థుల అకౌంట్‌లోకి నేరుగా స్కాలర్‌షిప్ డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేస్తుంది యూజీసీ. విద్యార్థులు తర్వాతి తరగతికి ప్రమోట్ కాకపోతే స్కాలర్‌షిప్ ఆగిపోతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "UGC Scholarship"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0