Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Why does the stomach fall ..! ? What to do to reduce ..?

 Vitamin C : పొట్ట ఎందుకు వస్తుంది .. ! ? తగ్గేందుకు ఏమి చేయాలంటే .. ?


Vitamin C: పొట్ట చుట్టూ కొవ్వు లేదా బెల్లీ ఫ్యాట్ అనేది మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో శరీరక శ్రమ తగ్గిపోయింది. ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుని పనులు చేసుకోవడం, ఆహార అలవాట్లలో తేడా రావడంతో పాటు మారిన జీవన శైలి. అల్కాహాల్, స్మోకింగ్ తదితర కారణాల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీంతో శరీర ఆకృతి చూసేందుకు అసహ్యంగా మారుతుంది. ఇక బాన పొట్ట కరిగించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. వ్యాయామం చేయడం, డైట్ ఫాలో కావడం, స్వీట్స్, ఇతర ఫాస్ట్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం చేస్తుంటారు. అయినప్పటికీ పొట్ట చుట్టూ కొవ్వు కరగక ఇబ్బందులు పడుతుంటారు.

అయితే పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకుపోవడానికి కారణంగా విటమిన్ సీ లోపమని చెబుతున్నారు. ఎక్కువ మంది విటమిన్ సీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుందని భావిస్తుంటారు. అయితే ఇది ఒక అపోహా మాత్రమే. వాస్తవానికి మన మెదడు చురుగ్గా పని చేయాలన్నా. షుగర్ వ్యాధి రాకుండా ఉండాలన్నా, క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉండాలన్నా, ఎముకలు పటుత్వంగా ఉండాలన్న విటమిన్ సీ ఎంతో అవసరమని వైద్యులు చెబుతున్నారు.

శరీర బరువును క్రమబద్దీకరించడంలోనూ విటమిన్ సీ బాగా పని చేస్తుందట. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగాలన్నా, కొవ్వు పేరుకుపోకుండా ఉండాలన్నా కశ్చితంగా విటమిన్ సీ ఫుడ్స్ ఆహారంలో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ సీ నారింజ, నిమ్మ, ద్రాక్ష, కివి, టమాటా, బొప్పాయి, క్యాప్సికమ్, బ్రకోలీ, మొలకలు, కాలిఫ్లవర్ వంటి వాటిలో సమృద్ధిగా ఉంటుంది. వీటిలో ఆహారంలో చేర్చుకుంటే కొవ్వును నియంత్రించుకోవచ్చు, పొట్టను తగ్గించుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Why does the stomach fall ..! ? What to do to reduce ..?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0