AP Jobs: Jobs in that government department in AP .. No exam .. Selection of candidates through direct interview.
AP Jobs: ఏపీలోని ఆ ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల(Health Jobs) భర్తీకి అధికారులు మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే కేవలం ఇంటర్వ్యూ (Interview) ద్వారానే అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టీవల తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శాఖలో ఉద్యోగాల(Health Jobs) భర్తీకి ఇటీవల వరుసగా ప్రకటనలు విడుదల అవుతున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లను అధికారులు విడుదల చేస్తున్నారు. తాజగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీకి ఆ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం(DMHO) నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. పారామెడికల్ ఆప్తాలిక్ అసిస్టెంట్ (Paramedical Ophthalmic Assistant Posts) విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 21 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంకా ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఎగ్జామ్ నిర్వహించడం లేదు. కేవలం ఇంటర్వ్యూ (Interview) ద్వారానే అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1న జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి కార్యాలయంలో తెలిపారు.
0 Response to "AP Jobs: Jobs in that government department in AP .. No exam .. Selection of candidates through direct interview."
Post a Comment