Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APHMA Meeting WITH CSE,SCERT - Details

 APHMA Meeting WITH CSE,SCERT - Details   ఆంధ్ర ప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం తో విద్యా కమిషనర్ గారి తో చర్చలు.. వివరాలు.

APHMA Meeting WITH CSE,SCERT - Details


ఆంధ్ర ప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం తో విద్యా కమిషనర్ గారి చర్చలు సఫలం.

       ఆంధ్ర ప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘ నాయకులతో ఈరోజు పాఠశాల విద్యా శాఖ కమిషనర్  శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు మరియు ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ శ్రీ ప్రతాప రెడ్డి గారితో ప్రధానోపాధ్యాయులు సమస్యలపై పై విద్యా శాఖ కమిషనర్ వారి కార్యాలయంలో చర్చలు జరిగాయి. ఈ చర్చలో ఆంధ్ర ప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నారాయణ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గారు , కోశాధికారి రమణయ్య గారు మరియు రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన ఆంధ్ర ప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘ బాధ్యులు పాల్గొన్నారు. ఈ చర్చలో పలు సమస్యలపై కమిషనర్ గారు సమాధానాలు ఇవ్వడం జరిగింది.

ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు పోస్టుల భర్తీ విషయమై వెంటనే  ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేస్తామని తెలియజేశారు.

నూతనంగా అప్ గ్రేడ్ అయిన పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయుల ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరు విషయమై ఆర్థిక శాఖకు మరొకసారి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.

పాఠశాలలో ఎప్పటికప్పుడు ఏర్పడే ఖాళీలను నింపడానికి ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులకు నెలవారీ పదోన్నతుల కై ప్రధానోపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు తయారు చేసి వివాదరహితంగా పదోన్నతులు ఇస్తామని తెలియజేశారు.

జగనన్న గోరుముద్ద రేషన్ పంపిణీ కార్యక్రమం అమలుకు సంబంధించిన సమస్యలపై డైరెక్టర్ గారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.

ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులపై ఆప్ ల భారం తగ్గిస్తామని   ,  సర్వర్ సామర్థ్యం పెంచి  ఆప్ ల వినియోగం సులభతరం చేస్తామని తెలియజేశారు. చైల్డ్ ఇన్ఫో కు సంబంధించి విద్యార్థి అడ్మిషన్ వివరాలను అప్లోడ్ చేయడానికి ఇచ్చిన సమయం పూర్తవగానే విద్యార్థుల వివరాలను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని తెలియజేశారు. ఇది నిరంతరం కొనసాగుతుందని అని అన్నారు.

జగనన్న విద్యా కానుక పంపిణీ మరియు బయోమెట్రిక్ వేయడం మొదలైన అంశాలలో గల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆయా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.

పాఠశాలలో టాయిలెట్స్ నిర్వహణకు శానిటరీ వర్కర్లకు ఆగస్టు నెల నుంచి 6 వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తామని, అంతకుమునుపు నవంబర్ 2020 నుండి 5000  రూపాయల చొప్పున ఫిబ్రవరి 2021 నుండి   6000 రూపాయల చొప్పున చెల్లించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన లు పంపిస్తామని తెలియజేశారు.

పాఠశాలలో అత్యధికంగా ఉన్న విద్యుత్ ఛార్జీలను తగ్గించడానికి ప్రస్తుతం అన్ని పాఠశాలలో కేటగిరి 7 లో లో అనగా మార్షల్ కేటగిరి లో ఉన్న విద్యుత్ కనెక్షన్లను కేటగిరి 2 డొమెస్టిక్ గా మార్పు చేయడానికి , పాఠశాల ఆవరణలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లను తొలగించడానికి విద్యుత్ శాఖకు  ఆదేశాలు ఇవ్వవలసిందిగా ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలియజేశారు.

2021-22 విద్యాసంవత్సరంలో స్థానిక సెలవులు మరియు ఆప్షనల్ సెలవులను ప్రధానోపాధ్యాయులు స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయించుకోవచ్చు అని , ఈ సెలవులు వివరాలను ఏ పీ టి ఈ ఎల్ ఎస్ యాప్ లో నమోదు చేయు అవకాశం ప్రధానోపాధ్యాయుని లాగిన్లో అవకాశం కల్పిస్తామని తెలియజేశారు.

9, 10 తరగతుల విద్యార్థులకు స్పెషల్ ఫీజు వసూలును రద్దు చేస్తూ  ఉత్తర్వులు ఇస్తామన్నారు.

పాఠశాల అకడమిక్ క్యాలెండర్ మరియు ఇతర ముఖ్యమైన విషయాలను రూపొందించడంలో ప్రధానోపాధ్యాయుల సంఘం సూచనను స్వీకరిస్తామని తెలియజేశారు.

పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలకు సంబంధించి కోవిడ్ నిబంధనల ప్రకారం రోజుకు ఒక తరగతి చొప్పున ఎన్నిక నిర్వహించుకునే విధంగా  మూడు రోజుల సమయం ఇచ్చే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని సమగ్ర శిక్ష ఎస్పీడి గారికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలియజేశారు.

నాడు నేడు లో అభివృద్ధి చేసిన పాఠశాలలకు కరెంట్ బిల్లు మరియు ఇతర  మెయింటెనెన్స్ ఖర్చుల నిమిత్తం ప్రతి ఉన్నత పాఠశాల కు కనీసం ఐదు లక్షల రూపాయలు కంటింజెన్సీ నిధులను మంజూరు చేస్తామని తెలియజేశారు.

 తొలి విడత నాడు-నేడు పనులలో ఎదురైన అనుభవాల దృష్ట్యా రెండో విడత నాడు-నేడు పనులు నిర్వహణలో తీసుకు రావాల్సిన మార్పుల గురించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తగు నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేశారు.

బయోమెట్రిక్ హాజరు కోసమై కొత్త పరికరాలు అందజేస్తూ నాణ్యమైన సాఫ్ట్ వేర్ రూపొందించి అందజేస్తామని తెలియజేశారు.

కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు తమ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయుల పర్యవేక్షణ బాధ్యత మరియు ఇతర విషయాలు అప్పగిస్తూ పాఠశాల నిర్వహణ మరియు అజమాయిషీని వికేంద్రీకరణ చేస్తామని తెలియజేశారు.

పాఠశాలల నిర్వహణ కోసం ఇచ్చే నిధులను గత సంవత్సరం పిడి అకౌంట్ ల ద్వారా విడుదల అయినప్పటికీ ఇంతవరకు జమ కాని నిధులు అన్నిటినీ వెంటనే విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వానికి తెలియజేస్తామని అన్నారు.

చిత్తూరు మరియు ప్రకాశం జిల్లాల్లో డైట్ సీనియర్ లెక్చరర్ గా ప్రధానోపాధ్యాయులను ఫారిన్ సర్వీస్ పై వెంటనే నియమింప చేసేటట్లుగా ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు ఇస్తామని తెలియజేశారు.

గుంటూరు జిల్లాలో వాయిదా పడిన ప్రధానోపాధ్యాయుల బదిలీలను వెంటనే నిర్వహించడానికి వీలుగా ఆ జిల్లా ప్రధానోపాధ్యాయులు లతో సమావేశం నిర్వహించి పరిష్కరిస్తామని తెలియజేశారు.

DCEB ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నుంచి ఎటువంటి రుసుములు వసూలు చేయరాదని ఉత్తర్వులు ఇస్తామని తెలియజేశారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని రేషనలైజేషన్ చేయడానికి పంచాయతీరాజ్ కమిషనర్ గారితో సంప్రదించి పపరిష్కరిస్తామని తెలియజేశారు.

పాఠశాలలో వివిధ కార్యక్రమాల ఆన్లైన్ విషయాలు చూడడానికి  ఇప్పటి కే ప్రతి పాఠశాలలో ఉన్న part time instructer  ఆ బాధ్యతను అప్పగిస్తామని చెప్పడం జరిగింది.

 పాఠశాల 500 మంది విద్యార్థులు దాటిన ప్రతి పాఠశాల నూ మరియు ప్రతి మండలంలోనూ  2 ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాల గా ఉన్నతీకరించి,  ఉపాధ్యాయులకు J L s  గాను  ప్రధానోపాధ్యాయులకు  ప్రిన్సిపాల్ గా పదోన్నతులు ఇస్తామని చెప్పడం జరిగింది.

250 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాల నుంచి మాత్రమే 3,  4, 5 తరగతులు ఉన్నత పాఠశాల లో విలీనం చేస్తామని,  వచ్చే విద్యా సంవత్సరం నుండి ఒక కిలో మీటర్ల పరిధిలో ఒక ప్రాథమిక పాఠశాల నుండి 3 4 5 తరగతుల ఉన్నత పాఠశాల కు అనుసంధానం చేస్తామని 3 4 5 తరగతులు కూడా స్కూల్ అసిస్టెంట్లు సబ్జెక్ట్ వారి బోధన చేసేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

 స్కూల్ కాంప్లెక్స్ ను బలోపేతం చేస్తామని వీటిని మరింత అభివృద్ధి చేయడానికి ప్రధానోపాధ్యాయ సంఘ సలహాలు సూచనలు కోరడం జరిగింది.

త్వరలోనే ప్రధానోపాధ్యాయుల సంఘం తో మరో రెండు దఫాలు చర్చలు జరిపి మధ్యాహ్న భోజన పథకం స్కూల్ శానిటేషన్ నాడు నేడు మొదలైన అంశాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని పాఠశాల అభివృద్ధి లో ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమై నందున విద్యాభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించే ప్రధానోపాధ్యాయుల సహకారంతోనే విద్య అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేసారు. ఉన్నత పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించి  ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్న  రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై ఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి,  సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని ఆంధ్ర ప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘంతో సమావేశం ఏర్పాటు చేసిన గౌరవ పాఠశాల విద్యా కమిషనర్ గారికి సహకరించిన ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శ్రీ ప్రతాప రెడ్డి గారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అన్ని విధాలుగా తమ సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేశారు.




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APHMA Meeting WITH CSE,SCERT - Details "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0