CBSE Syllabus in Schools
పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్
- మూడో తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా టీచర్లు
- నాడు-నేడుపై ఇంజనీర్లు, పేరెంట్స్ కమిటీలకు శిక్షణ: సీఎం
- ‘దీవెన’పై రివ్యూ పిటిషన్‌కు నిర్ణయం
ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎ్‌సఈ అఫిలియేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. తొలి విడతలో వెయ్యి స్కూళ్లను సీబీఎ్‌సఈతో అఫిలియేషన్ చేయాలని, ఆ తర్వాత అన్నిరకాల స్కూళ్లను చేయాలని నిర్దేశించారు. ఐసీఎ్‌సఈ అఫిలియేషన్ మీద కూడా దృష్టిపెట్టాలన్నారు. నాడు-నేడు పనులు, ఫౌండేషన్ స్కూళ్లపై సీఎం మంగళవారం సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు రెండో విడతలో 12,663 పాఠశాలల్లో రూ.4,535 కోట్లతో పనులకు ప్రణాళిక రూపొందించామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. మూడో విడతలో నాడు-నేడు కింద 24,900పాఠశాలల్లో రూ.7,821 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. రెండో విడత నాడు-నేడు టెండర్లను వెంటనే పిలవాలని సీఎం ఆదేశించారు.
పాఠశాలల నిర్వహణ, వాటిలో మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ఈ ఏడాది విద్యాకానుక పంపిణీ నూరుశాతం పూర్తయిందని అధికారులు తెలపగా, వచ్చే ఏడాది విద్యాకానుకలో స్పోర్ట్స్ షూ, స్పోర్ట్స్ డ్రెస్ ఉంటాయని, వాటి డిజైన్, నాణ్యత బాగుండేలా చూడాలని సీఎం ఆదేశించారు. విద్యాకానుక వస్తువులన్నీ నాణ్యంగా ఉండాలని స్పష్టం చేశారు. పాఠ్యపుస్తకాల నాణ్యత పెంచాలని, కనీసం మూడో తరగతి నుంచి అయినా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండేలా చూడాలని ఆదేశించారు. స్వేచ్ఛ కార్యక్రమం కింద పాఠశాలల్లో ఆడపిల్లలకు శానిటరీ నాప్‌కిన్స్ పంపిణీ కార్యక్రమం అక్టోబరు మధ్యలో ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. కాగా, జగనన్న విద్యాదీవెన పథకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా సమావేశంలో చర్చించారు. రీయింబర్స్‌మెంట్ సొమ్మును కళాశాలలకు నేరుగా చెల్లించాలని కోర్టుఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సమీక్షలో విద్యామంత్రి ఆదిమూలపు సురేశ్, మహిళా-శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
0 Response to "CBSE Syllabus in Schools"
Post a Comment