Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Corona virus: 4 factors that increase the risk of contracting the virus when vaccinated

 కరోనా వైరస్ : వ్యాక్సీన్ వేసుకున్నా , వైరస్ సంక్రమించే ప్రమాదాన్ని పెంచే 4 అంశాలు.

Corona virus: 4 factors that increase the risk of contracting the virus when vaccinated

కోవిడ్-19 వ్యాక్సీన్ రెండో డోసు తీసుకున్న రెండు వారాల తర్వాత, టీకా నుంచి ఏర్పడే రక్షణ గరిష్ఠ స్థాయిలో ఉంటుంది.

అప్పుడే ఒక వ్యక్తి పూర్తి వ్యాక్సీన్ తీసుకున్నట్లు చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా ఆ వ్యక్తికి కోవిడ్-19 సోకితే, దాన్ని 'బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్‌'గా పరిగణిస్తారు.

అంటే టీకాలు వేసుకోనివారికి సోకినట్లే, వేసుకున్నవారికి కూడా కోవిడ్ వస్తుంది. అయితే ఇందులో కొన్ని తేడాలు ఉండొచ్చు.

ఒక వ్యక్తి ఇప్పటికే రెండు డోసులూ వేసుకుని ఉంటే ఈ కింది విషయాలు గుర్తుంచుకోవాలి.

'టీకా వేసుకున్న వారిలో కోవిడ్ లక్షణాలు భిన్నంగా ఉంటాయి'

కోవిడ్-19 లక్షణాలపై జరిగిన పరిశోధనల ప్రకారం, టీకా వేసుకున్న వ్యక్తుల్లో తలనొప్పి, ముక్కు కారడం, తుమ్ములు, గొంతు నొప్పి, వాసన కోల్పోవడంలాంటి ఐదు లక్షణాలు కనిపిస్తాయి.

టీకా వేసుకోని వారికి కోవిడ్ సోకినప్పుడు ఈ లక్షణాల్లో కొన్ని వారిలో కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి తలనొప్పి, గొంతు నొప్పి, ముక్కు కారటం అనే మూడు లక్షణాలు.

అయితే టీకా వేసుకోని వారిలో ఉండే మిగతా రెండు ప్రధాన వ్యాధి లక్షణాలు జ్వరం, నిరంతర దగ్గు.

ఈ రెండు లక్షణాలు కోవిడ్-19ని సూచించే సాధారణ లక్షణాలు. అయితే టీకా వేసుకున్న వారిలో ఇవి చాలా తక్కువగా కనిపిస్తుంటాయి.

టీకా వేసుకోని వారితో పోలిస్తే, వ్యాక్సీన్ వేసుకున్న వారికి కరోనా సోకితే జ్వరం వచ్చే అవకాశం 58 శాతం తక్కువ అని ఒక అధ్యయనంలో తేలింది. చాలా మందికి, కోవిడ్-19 టీకా తర్వాత చలిగా అనిపిస్తుంది.

అలాంటి వారికి ఈ వ్యాధి వస్తే, వారు ఆస్పత్రి పాలయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సంక్రమణ ప్రారంభ దశలో వారికి తక్కువ లక్షణాలు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు వీరికి దీర్ఘకాలంలో ఆ వ్యాధి సోకే అవకాశం తక్కువ.

వైరస్ సోకకుండా టీకా పూర్తిగా అడ్డుకోలేకపోయినప్పటికీ, వ్యాధి సోకినపుడు దాని తీవ్రత ఎక్కువ కాకుండా కాపాడుతుంది.

ప్రమాదాన్ని పెంచేది ఏది?

బ్రిటన్‌ జనాభాలో 0.2 శాతం లేదా 500 మందిలో ఒకరికి రెండు డోసుల టీకా వేసుకున్న తర్వాత కూడా కరోనా సోకుతున్నట్లు ఒక పరిశోధనలో తేలింది.

కానీ ఈ ముప్పు అందరికీ ఒకేలా ఉండదు. టీకా తీసుకున్న తర్వాత దాని రక్షణను నాలుగు అంశాలు ప్రభావితం చేస్తాయి.

1. టీకా రకం

మొదటిది మీరు వేసుకునే వ్యాక్సీన్ రకం. అది వ్యాధి వల్ల వచ్చే ముప్పును ఏ మేరకు తగ్గించగలదనే అంశం.

ఇప్పటివరకు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో మోడెర్నా వ్యాక్సీన్ రోగ లక్షణాల ముప్పును 94 శాతం తగ్గించగా, ఫైజర్ వ్యాక్సీన్ 95 శాతం తగ్గించింది.

జాన్సన్ అండ్ జాన్సన్ సుమారు 66 శాతం, ఆస్ట్రాజెనెకా 70 శాతం తగ్గిస్తాయని పరిశోధనల్లో తేలింది. (మోతాదుల మధ్య సుదీర్ఘ విరామం ఇవ్వడం వల్ల ఆస్ట్రాజెనెకా టీకా వల్ల రక్షణ 81 శాతానికి పెరిగింది)

2. టీకా తీసుకున్న తర్వాత గడచిన సమయం

టీకా తీసుకున్నప్పటి నుంచి సమయం కూడా చాలా కీలకం అని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల అదనపు, బూస్టర్ డోస్‌ గురించి చర్చ జరగడానికి ఇదొక కారణం.

టీకా వేసుకున్న ఆరు నెలల తర్వాత ఫైజర్ వ్యాక్సీన్ నుంచి అందే రక్షణ తగ్గుతుందని తొలి దశ పరిశోధనల్లో తేలింది. అయితే, దీన్ని మిగతా శాస్త్రవేత్తలు సమీక్షించాల్సివుంది.

ఆరు నెలలు దాటిన తర్వాత వ్యాక్సీన్ ప్రభావం ఉంటుందా లేదా అనేది తెలుసుకోవడం ఇప్పటికిప్పుడు తొందరపాటే అవుతుంది. కానీ వ్యాక్సీన్ ఇచ్చే రక్షణ మరింత తగ్గే అవకాశం మాత్రం ఉంది.

3. కోవిడ్ వేరియంట్లు

మీరు ఏ వేరియంట్ కరోనా వైరస్‌కు గురయ్యారనేది మరో ముఖ్యమైన అంశం.

ఇంగ్లండ్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డేటా ప్రకారం, ఆల్ఫా వేరియంట్‌ సోకినప్పుడు ఫైజర్ వ్యాక్సీన్ రెండు డోసుల ప్రభావం 95 నుంచి 93 శాతానికి తగ్గింది. డెల్టా వేరియంట్ మీద అది పోరాడే శక్తి 88 శాతానికి పడిపోయింది.

ఆస్ట్రాజెనెకా టీకా కూడా ఇలాంటి ఫలితాలనే ఇచ్చింది.

ఫైజర్ రెండో డోసు వేసుకున్న రెండు నుంచి నాలుగు వారాల తర్వాత ఎవరికైనా డెల్టా వేరియంట్‌ సోకితే, వారిలో కోవిడ్-19 లక్షణాలు ఉండటానికి 87శాతం తక్కువ అవకాశం ఉందని ఈ డేటా సూచిస్తోంది.

నాలుగు నుంచి ఐదు నెలల తర్వాత అది 77 శాతానికి పడిపోతుంది.

4. మన రోగ నిరోధక వ్యవస్థ

ఒక వ్యక్తికి కరోనా సోకే ముప్పు అతనిలో రోగనిరోధక స్థాయి, మిగతా నిర్దిష్ట కారకాలపై ఆధారపడి ఉంటుంది (వైరస్‌కు ఎంత ఎక్స్‌పోజ్ అయ్యారు లాంటివి)

రోగ నిరోధక శక్తి సాధారణంగా వయసు పెరుగుతున్నా కొద్దీ తగ్గుతుంది.

దీర్ఘకాలిక చికిత్స తీసుకోవడం, టీకాకు మన శరీరం స్పందించే తీరుపై కూడా రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. అందుకే వృద్ధులు లేదా బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉన్నవారు వ్యాక్సీన్ తీసుకున్నప్పటికీ వారికి టీకా నుంచి తక్కువ రక్షణ లభించొచ్చు. లేదంటే వారి రక్షణ మరింత వేగంగా క్షీణించవచ్చు.

ఆరోగ్య సమస్యలు ఉన్న వారు అందరికంటే ముందు టీకాలు వేసుకున్నారనే విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. బహుశా ఎనిమిది నెలల ముందే వీరు టీకా వేసుకోవడం వల్ల వారికి కోవిడ్-19 రాకుండా ఉండే రక్షణ తగ్గే అవకాశం ఉంది.

ఇది ఆందోళనకరమా?

పైన పేర్కొన్న వాటిని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, కోవిడ్-19 సంక్రమించే అవకాశాలను టీకాలు చాలా వరకు తగ్గిస్తాయి. ఆసుపత్రి పాలవకుండా, ప్రాణాపాయం లేకుండా కాపాడుతాయి.

ఏదేమైనా టీకా వేసుకున్న వారిలో ఇన్‌ఫెక్షన్లు కనిపించడం ఆందోళన కలిగించే విషయమే. టీకా రక్షణ కాలక్రమేణా తగ్గిపోతే కేసులు పెరగవచ్చనే అనుమానాలు, ఆందోళనలూ ఉన్నాయి.

అందుకే అత్యంత ముప్పు ఉంటుందని భావించిన వారికి బూస్టర్ డోసు ఇవ్వడం గురించి ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి. అది మిగతా వారికి కూడా విస్తరించాలా వద్దా అనేది కూడా ఆలోచిస్తున్నాయి.

ఫ్రాన్స్, జర్మనీ ఇప్పటికే కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న వారికి అదనపు డోసు అందించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

అంటే బూస్టర్‌ డోసులు మాత్రమే వైరస్‌ నుంచి కాపాడతాయని, టీకా సాధారణ డోసులు పని చేయవని మనం అనుకోకూడదు.

ఈలోపు టీకా ఇంకా వేసుకోని వారిని, వెంటనే రెండు డోసులూ వేసుకునేలా ప్రోత్సహించడం చాలా అవసరం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Corona virus: 4 factors that increase the risk of contracting the virus when vaccinated"

Post a Comment