Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Election of Parents Committees -2021

పేరెంట్స్ కమిటీల ఎన్నిక-2021

Election of Parents Committees -2021

ఎన్నికలలో పాటించవలసిన నియమాలు:

 • పేరెంట్స్ కమిటీ కాలపరిమితి రెండు సంవత్సరాలు పూర్తి అయిన వాటికి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయవలెను.
 • గతంలో పేరెంట్స్ కమిటీ కి అసలు ఎన్నికలు జరగని వాటికి ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయవలెను.
 • ప్రతి తరగతికి కోరం50% ఉండాలి
 • సాధారణంగా ఎన్నిక చేతులు ఎత్తడం ద్వారా గానీ నోటితో చెప్పడం ద్వారా గానీ జరగాలి. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిని అనుసరించాలి.
 • పేరెంట్స్ / గార్డెన్లలో ఒక్కరికి మాత్రమే ఓటు ఓటు వేసే హక్కు ఉంది,వారి పిల్లలు వేర్వేరు క్లాసులో చదువుతుంటే ఆ ఆ క్లాసులో ఓటేసే హక్కు ఆ పేరెంట్స్కు ఉంది.
 • ఎన్నిక కాబడిన పేరెంట్స్ కమిటీ మెంబర్స్ నుండి ఒకరిని  చైర్మన్గా మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకోవాలి ఇద్దరిలో ఒకరు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి. కనీసం ఒకరు  డిసడ్డ్వాంటేజ్ గ్రూప్ లేదా వీకర్ సెక్షన్ కు చెందిన వారై ఉండాలి.
 • నైబర్హుడ్ ఏరియా స్కూల్ అనగా ప్రైమరీ స్కూల్ అయితే కిలోమీటర్ల లోపు హైస్కూలు / యు పి స్కూల్ అయితే మూడు కిలోమీటర్ల లోపు ఉండాలి. ▪️డిసడ్వాంటేజెస్ గ్రూప్ అనగా ఎస్సీ, ఎస్టీ, అనాధ పిల్లలు, Migrants, స్ట్రీట్ చిల్డ్రన్ అండ్ హెచ్ ఐ వి  బాధిత చిల్డ్రన్.
 • వీకర్ సెక్షన్  అనగా బిసి,మైనారిటీ అండ్ ఓసి పిల్లలు ఇన్కమ్ పరిధి లో ఉన్నటువంటి వారు (వైట్ కార్డ్ హోల్డర్ ).
 • ఎమ్మార్వో, ఎంపీడీవో, విఆర్వో, విలేజ్ సెక్రటరీ, వీఆర్ఏలు ఎన్నికల ప్రక్రియలో  అబ్జర్వర్ గా  ఉంటారు.

ఓటింగ్ Order of priority ఈ విధంగా ఉంటుంది 

 • మదర్,ఫాదర్ వీరిద్దరూ లేకపోతే గార్డియన్.
 • ప్రతి ఓటరు ఈ దిగువ తెలిపిన ఏదో ఒక ఐడి కార్డు తప్పనిసరిగా తేవాలి.
 • రేషన్ కార్డ్
 • ఆధార్ కార్డ్
 • డ్రైవింగ్ లైసెన్స్
 • ఓటర్ ఐడి 
 • ఇంకేదైనా ప్రభుత్వంచే జారీ చేయబడిన ఐడీ కార్డు. 
 • డిసడ్వాంటేజెస్ /వీకర్ సెక్షన్ కు చెందిన పిల్లల తల్లిదండ్రులు ఎలక్షన్లకు హాజరు కాలేక పోతే రిజర్వేషన్ ప్రకారం వాటిని ఫిల్ చేయాలి.

కమిటీ నిర్మాణం

 • ఎన్నిక కాబడిన సభ్యులు
 • వీరిలో ఒకరు డిసడ్డ్వాంటేజ్ గ్రూపుకు చెందిన వారు,మరొకరు వీకర్ సెక్షన్ కు చెందిన వారు అయి ఉండాలి .
 • అంతే కాకుండా కనీసం ఇద్దరు  స్త్రీలు అయి ఉండాలి .ఈ విధంగా ప్రతి క్లాసుకు ముగ్గురు ఉండాలి ఆ పాఠశాలల్లో ఎన్ని తరగతులు ఉంటే  అన్ని తరగతుల సంఖ్యకు మూడు రెట్ల సభ్యులు ఉండాలి. ఒక తరగతిలో పిల్లల సంఖ్య ఆరు కన్నా తక్కువగా ఉంటే ఆ పై తరగతి తో గానీ   ముందు తరగతి తో  గాని కలిపి ఎలక్షన్ నిర్వహించాలి .ఎన్నిక కాబడిన వ్యక్తి యొక్క పదవీకాలం రెండు సంవత్సరాలు లేదా పిల్లలు స్కూలు వదిలి వెళ్లే వరకు ఈ రెండిటిలో ఏది ముందు అయితే అంత వరకు ఉంటుంది .
 • ఆ పాఠశాల యందు పెద్ద తరగతి పిల్లలు వెళ్ళిపోతే ఎంట్రీ క్లాస్ పిల్లల  తల్లిదండ్రులను ఎన్నుకోవాలి.

ఎక్స్    అఫీషియో   మెంబర్లు:

 • హెచ్ఎం గానీ ఇన్చార్జి HM గాని కన్వీనర్గా ఉంటారు. హెచ్ ఎం / ఇన్చార్జి HMకు వ్యతిరేక జండర్ కలిగిన ఒక టీచర్ను MEO నామినేట్ చేస్తారు.
 •  ఆ ప్రాంతానికి చెందిన కార్పోరేటర్ గానీ కౌన్సిలర్ గానీ వార్డ్ మెంబర్ గానీ ఉంటారు.
 •  నైబర్హుడ్ ప్రాంతానికి చెందిన అంగన్వాడీ వర్కర్ ఉంటారు .
 • ఆ ప్రాంతానికి చెందిన ANM ఉంటారు.
 •  ఆ గ్రామం లేక వార్డు కు చెందిన మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ ఉంటారు.

కో  ఆప్టెడ్ మెంబెర్స్ 

 • ఇద్దరు స్కూల్ కి సపోర్ట్ చేసే బాగా చదువుకున్న వ్యక్తులు  గాని ఇతరులకు సహాయం చేసే వ్యక్తులు గాని ఉంటారు.
 • లోకల్ అథారిటీ చైర్పర్సన్ ఆ ప్రాంతానికి చెందిన సర్పంచ్ కానీ మున్సిపల్ చైర్ పర్సన్   హాజరు కావచ్చు.
 • చుట్టు పక్క రాష్ట్రాల పిల్లల తల్లిదండ్రులు ఎలక్షన్లలో పాల్గొనవచ్చు .
 • పేరెంట్స్ కమిటీ ఎన్నిక మరియు మీటింగు  డేటామొత్తాన్ని  అప్లోడ్ చేయాలి 
 • covid 19 నిబంధనలు  తప్పనిసరిగా పాటించాలి.

ఎలక్షన్ ప్రక్రియ లో చేయకూడని పనులు

 • Private Un Aided స్కూల్స్ లో మాత్రమే ఎలక్షన్స్ జరగకూడదు.
 • స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించేవారు,స్కూల్ HM/ I/C HM  ఎన్నికలలో పాల్గొనకూడదు.వారికి ఓటు హక్కు లేదు.
 • ఎన్నికలలో రాజకీయ జోక్యం ఉండకూడదు.
 • ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జాయిన్ అయిన పిల్లల తల్లిదండ్రులు ఎలక్షన్లో పాల్గొనకూడదు.
 • గార్డెన్ను చైర్పర్సన్గా నిర్మించకూడదు.
 • పేరెంట్స్,గార్డెన్ తప్ప మిగిలిన వారెవరూ స్కూలు ఆవరణలో ప్రవేశించకూడదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Election of Parents Committees -2021"

Post a Comment